2020 ఏడాదిని ఫ్లాట్‌గా ముగించాయి దేశీయ సూచీలు. సెన్సెక్స్ 5 పాయింట్ల స్వల్ప లాభపడగా.. నిఫ్టీ 0.2 శాతం నష్టంతో ముగిసింది. ఒకానొకదశలో భారీ లాభాలతో జీవితకాల గరిష్ఠ స్థాయి 14,000వేల ఎగువకు చేరిన నిఫ్టీ.. చివరకు 13,982 పాయింట్ల వద్ద స్థిరపడింది. కరోనా లాక్‌డౌన్‌తో మార్చిలో 8వేల దిగువకు చేరిన నిఫ్టీ.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని 86 శాతం మేర లాభపడింది.
మరోవైపు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ కూడా 47,866 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగి చివరకు 2020 ఏడాదిని స్వల్ప లాభంతో ముగించింది. 5 పాయింట్లు లాభపడి 47,751 వద్ద స్థిరపడింది.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి మద్దతు లభించటం సహా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.
లాభనష్టాల్లోనివి..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్‌పెయింట్స్, సెయిల్, భారత్ ఎలక్ట్రానిక్స్, వొడాఫోన్ ఐడియా, జుబిలంట్ ఫుడ్స్, నాల్కో భారీగా లాభపడ్డాయి.
మరోవైపు.. నెస్లే ఇండియా, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, జీఎంఆర్ ఇన్ఫ్రా, శ్రీ సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, ఏసీసీ, ఎంఆర్ఎఫ్ నష్టాలను మూటగట్టుకున్నాయి.