ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు- 58,500 దిగువకు సెన్సెక్స్ - షేర్ మార్కెట్ ఇంట్రాడే

స్టాక్ మార్కెట్లు (Stock Market) ఈ వారం తొలి సెషన్​ను భారీ నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ (Sensex Today) 525 పాయింట్లు తగ్గి.. 58,500 మార్క్​ను కోల్పోయింది. నిఫ్టీ (Nifty Today) 188 పాయింట్ల నష్టంతో 17,400 దిగువకు చేరింది. టాాటా స్టీల్​ అత్యధికంగా 10 శాతం నష్టాన్ని మూటగట్టుకుంది.

Stocks close with lose
స్టాక్ మార్కెట్లకు నష్టాలు
author img

By

Published : Sep 20, 2021, 3:44 PM IST

స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో సెషన్​లోనూ నష్టాలను నమోదు చేశాయి. సోమవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 525 పాయింట్లు తగ్గి 58,490 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 188 పాయింట్ల నష్టంతో 17,396 వద్దకు చేరింది.

మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. లోహ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఫలితంగా సూచీలు ఈ స్థాయి నష్టాలను మూటగట్టుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 59,202 పాయింట్ల అత్యధిక స్థాయి, 58,469 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,622 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,389 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​యూఎల్​, బజాజ్ ఫిన్​సర్వ్​, ఐటీసీ, నెస్లే, హెచ్​సీఎల్​టెక్ లాభాలను గడించాయి.

టాటా స్టీల్​ (10 శాతం), ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, డాక్టర్​ రెడ్డీస్​ భారీగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీ నష్టాలతో ముగిసింది. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు సెలవులో ఉన్నాయి.

ఇదీ చదవండి: గూగుల్ నుంచి 'ఒరిజినల్​ ఆలు చిప్స్'​- మీకూ కావాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.