స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 393 పాయింట్లు పుంజుకుని 52,699 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 103 పాయింట్ల లాభంతో 15,790 వద్దకు చేరింది.
ఐటీ, లోహ, వాహన రంగాలకు లభించిన కొనుగోళ్ల మద్దతు లాభాలకు ప్రధాన కారణం.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,830 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,385 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,821 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 15,702 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్ అధికంగా లాభాలను గడించాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, పవర్‌గ్రిడ్ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, కోస్పీ, హాంగ్ సెంగ్ సూచీలు లాభాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి:అప్పుల ఊబిలో భారతీయ కుటుంబాలు