స్టాక్ మార్కెట్లలో (Stock Market) మంగళవారం కూడా లాభాల జోరు కొనసాగింది. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 149 పాయింట్లు పెరిగి 60,284 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 46 పాయింట్ల లాభంతో తొలిసారి 17,992 వద్దకు చేరింది.
ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. మిడ్ సెషన్ తర్వాత కాస్త తేరుకున్నాయి. ఆర్థిక, ఎఫ్ఎంసీజీ షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఐటీ షేర్లు డీలా పడ్డాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 60,331 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,885 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 18,009 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,864 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టైటాన్, బజాజ్ ఆటో, బజాజ ఫినాన్స్, ఎస్బీఐ, నెస్లే ఇండియా ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, సన్ ఫార్మా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చదవండి: శని, ఆదివారాల్లో ఎస్బీఐ ఆన్లైన్ సేవలకు అంతరాయం