స్టాక్ మార్కెట్లు (Stock Markets today) గురువారం కూడా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 287 పాయింట్లు కోల్పోయి 59,126 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 93 పాయింట్ల నష్టంతో 17,618 వద్దకు చేరింది. మార్కెట్లు నష్టాలతో ముగియటం వరుసగా ఇది మూడో సెషన్.
అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీనికి తోడు మదుపరులు అమ్మకాలను కొనసాగించడం కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్ ఆటో, ఐటీ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,557 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,019 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,742 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,585 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఎన్టీపీసీ, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను గడించాయి.
పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్బీఐ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు స్వల్ప లాభాలను గడించాయి. నిక్కీ (జపాన్), హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చదవండి: 'ఆటో పే' కొత్త రూల్స్ అక్టోబర్ 1 నుంచే- ఈ విషయాలు తెలుసుకోండి..