ETV Bharat / business

బడ్జెట్, కరోనా ప్రభావంతో మార్కెట్లు నష్టాలు - కరోనా వైరస్

కరోనా వైరస్ భయాలతో దేశీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. 285 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 40 వేల పాయింట్ల దిగువన ముగిసింది. నిఫ్టీ 94 పాయింట్లు పతనమై 12,035 వద్ద స్థిరపడింది.

sensex and nifty
కరోనా ధాటికి విలవిల-నష్టాలు మూటగట్టుకున్న మార్కెట్లు
author img

By

Published : Jan 30, 2020, 3:43 PM IST

Updated : Feb 28, 2020, 1:15 PM IST

భారత్​లో కరోనా వైరస్​కు సంబంధించి తొలి కేసు నమోదైనందున స్టాక్​ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం పడింది. రిలయన్స్​ వంటి భారీ షేర్లు పతనమవడం వల్ల దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఓ దశలో 550 పాయింట్లు కోల్పోయిన బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ చివరకు 285 పాయింట్ల నష్టంతో... 40,913 పాయింట్ల వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 94 పాయింట్లు నష్టపోయింది. చివరకు 12,035 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జనవరి ఫ్యూచర్, ఆప్షన్​ కాంట్రాక్టుల గడువు ముగుస్తున్నందున సూచీలపై ప్రతికూల ప్రభావం పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్​కు ముందు ఆందోళనలో ఉన్న మదుపరులు భారీ షేర్ల అమ్మకానికి మొగ్గుచూపడం వల్ల మధ్యాహ్నం నుంచి మార్కెట్లు మరింత పతనమయ్యాయి.

లాభనష్టాల్లోనివివే

సెన్సెక్స్​లోని 30 షేర్లలో బజాజ్ ఆటో, పవర్​గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్​ పెయింట్స్, ఎన్​టీపీసీ, మారుతీ, ఎల్​అండ్​టీ షేర్లు లాభాలు గడించాయి.
రిలయన్స్ షేర్లు అత్యధికంగా 2.62 శాతం మేర నష్టపోయాయి. నెస్లే ఇండియా, ఇండస్​ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాలు మూటగట్టుకున్నాయి.

రూపాయి

అమెరికా డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు కోల్పోయి 71.51 కి చేరింది.

ముడిచమురు

ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం 57.97 డాలర్లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లు

ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో ముగిశాయి. హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లో పయనిస్తున్నాయి.

Intro:देवास के पूर्व सांसद व अगर विधानसभा के वर्तमान विधायक मनोहर ऊँटवाल जी का बीती रात मेदांता अस्पताल गुड़गांव में निधन हो गया।Body:देवास। आगर मालवा विधानसभा सीट से भाजपा के विधायक और देवास लोकसभा के पूर्व सांसद मनोहर उंटवाल का निधन हो गया है। मनोहर उंटवाल को पिछले दिनों ब्रेन हेमरेज के बाद दिल्ली के मेदंता हॉस्पिटल में भर्ती किया गया था जहाँ बीती रात उनकी मौत हो गई।

2014 में बने थे देवास सांसद

मनोहर ऊंटवाल का जन्म 19 जुलाई 1966 को हुआ था। 2014 के लोकसभा चुनाव में देवास संसदीय सीट से सांसद थे। 2018 के विधानसभा चुनाव में भाजपा ने उन्हें आगर-मालवा से टिकट दिया था। मनोहर ऊंटवाल भाजपा के कद्दावर नेता थे। वो शिवराज सिंह सरकार में मंत्री भी थे। मनोहर लाल ऊंटवाल के निधन के बाद मध्यप्रदेश में एक औऱ सीट खाली हो गई है। इससे पहले मुरैना जिले की जौरा विधानसभा सीट से कांग्रेस विधायक बनवारी लाल शर्मा का लंबी बीमारी के बाद निधन हो गया था। वो लंबे समय से कैंसर से पीड़ित थे। उनकी उम्र 66 साल के थे।Conclusion:आगर मालवा विधानसभा सीट से भाजपा के विधायक और देवास लोकसभा के पूर्व सांसद मनोहर उंटवाल का निधन हो गया है। मनोहर उंटवाल को पिछले दिनों ब्रेन हेमरेज के बाद दिल्ली के मेदंता हॉस्पिटल में भर्ती किया गया था
Last Updated : Feb 28, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.