ETV Bharat / business

ఎన్​ఎస్​ఈలో సాంకేతిక లోపం- నిలిచిన ట్రేడింగ్​! - ఎన్​ఎస్​ఈ సాంకితక సమస్య

సాంకేతిక సమస్యలతో ఎన్​ఎస్​ఈ సూచీల లైవ్​ ధరల అప్​డేట్ ఆగిపోయింది. ఈ విషయంపై వివిధ బ్రోకరేజీలు తమ వినియోగదారులకు సమాచారమిచ్చాయి. ఎన్​ఎస్​ఈ మాత్రం ఇంకా ఈ విషయంపై ప్రకటన చేయలేదు.

technical error in NSE
ఎన్​ఎస్​ఈలో సాంకేతిక సమస్య
author img

By

Published : Feb 24, 2021, 12:20 PM IST

Updated : Feb 24, 2021, 12:35 PM IST

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజ్​ (ఎన్​ఎస్ఈ)లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా నిఫ్టీకి చెందిన ఆన్ని సూచీల్లో లైవ్‌లో ప్రైస్‌ కోట్స్‌ అప్‌డేట్‌ కావడం లేదు. అన్ని బ్రోకరేజ్ సంస్థలు ఈ విషయాన్ని తమ వినియోగదారులకు తెలిపాయి.

"ఎన్​ఎస్​ఈ సూచీల లైవ్​ టిక్స్​తో సమస్య తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మేము ఎన్​ఎస్​ఈతో సంప్రదింపులు జరుపుతున్నాం," జెరోధా, ప్రముఖ బ్రోకరేజ్​ ప్లాట్​ఫామ్.

నిఫ్టీ 112.65 పాయింట్ల లాభంతో.. 14,820.45 వద్ద, నిఫ్టీ బ్యాంక్​ 509.65 పాయింట్ల వృద్ధితో 35,626.60 వద్ద నిలిచిపోయాయి. ఉదయం 10:10 నిమిషాలకు సూచీలు చివరి సారిగా అప్​డేట్ అయ్యాయి. నిఫ్టీ అప్​డేట్స్ నిలిచిపోయిన విషయంపై రిటైల్ మదుపరులు ట్విట్టర్​లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లైవ్​ కోట్స్ అప్​డేట్స్ నిలిచిపోయిన దాదాపు రెండు గంటల తర్వాత ఎన్​ఎస్​ఈ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 11:40 గంటలకు అన్ని సెగ్మెంట్లను నిలిపేసినట్లు తెలిపింది. వీలైనంత త్వరగా లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

  • We are working on restoring the systems as soon as possible. In view of the above, all the segments have been closed at 11:40 and will be restored as soon as issue is resolved.

    — NSEIndia (@NSEIndia) February 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:మీడియా రంగం పుంజుకుంటుంది: క్రిసిల్​

Last Updated : Feb 24, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.