ETV Bharat / business

Molnupiravir Covid: కొవిడ్‌ చికిత్సలో మోల్నుపిరవిర్.. హైదరాబాద్ నుంచే సరఫరా.!

కొవిడ్​ మహమ్మారిని అరికట్టేందుకు మరో మెడిసిన్ అందుబాటులోకి రానుంది. కరోనా చికిత్సలో మోల్నుపిరవిర్(Molnupiravir Covid) క్రియాశీలకం కానుంది. క్లినికల్​ పరీక్షల్లో సైతం మోల్నుపిరవిర్​ సానుకూల ఫలితాలు చూపించడంతో.. ఈ మెడిసిన్ ఉత్పత్తిలో హైదరాబాద్​కు చెందిన పలు ఫార్మా కంపెనీలు.. కీలక పాత్ర పోషించనున్నాయి. డీసీజీఐ అనుమతి లభించిట్లయితే కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో కొవిడ్ కిట్​లో భాగంగా ఈ మందులు చోటు సంపాదించుకునే అవకాశం ఉంది.

Molnupiravir Covid
మోల్ను పిరవిర్
author img

By

Published : Oct 6, 2021, 8:42 AM IST

కొవిడ్‌ వ్యాధిని అదుపు చేయడంలో మోల్నుపిరవిర్‌(Molnupiravir Covid) ఎంతో ప్రభావ వంత ఫలితాలు నమోదు చేసిందనే అంశం స్థానిక ఫార్మా కంపెనీలకు మేలు చేయనుంది. ఈ ఔషధంపై అమెరికా, కెనడా దేశాల్లో ఎంఎస్‌డీ ఫార్మా, రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరప్యూటిక్స్‌లు క్లినికల్‌ పరీక్షలు నిర్వహించాయి. మూడో దశ పరీక్షల మధ్యంతర ఫలితాలను తాజాగా ఈ కంపెనీలు వెల్లడించాయి. కరోనా వైరస్‌ వ్యాధి సోకిన వెంటనే మోల్నుపిరవిర్‌(Molnupiravir Covid) ఔషధాన్ని తీసుకుంటే, ఆసుపత్రి పాలయ్యే అవసరం కానీ, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కానీ 50 శాతం మేరకు తగ్గిపోతున్నట్లు ఈ పరీక్షల్లో తేలినట్లు వివరించాయి. దీంతో ఈ ఔషధంపై వైద్య, ఫార్మా వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఇదీ నేపథ్యం

‘మోల్నుపిరవిర్‌’(Molnupiravir Covid) ను అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన బయోటెక్నాలజీ సంస్థ- ఎమోరీ ఎల్‌ఎల్‌సి. ఆవిష్కరించింది. తదుపరి దీన్ని ఎంఎస్‌డీ ఫార్మా, రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరప్యూటిక్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. క్లినికల్‌ పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో పెద్దఎత్తున ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేయటానికి ఎంఎస్‌డీ ఫార్మా సిద్ధమవుతోంది. ఇందుకు వీలుగా అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఎల్‌) కోసం యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద ఎంఎస్‌డీ ఫార్మా దరఖాస్తు చేయనుంది.

దివీస్‌ కీలకపాత్ర

ఈ ఔషధ ఉత్పత్తిలో మనదేశానికి చెందిన ఫార్మా కంపెనీలు అత్యంత క్రియాశీలకం కానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ ముఖ్యమైన పాత్ర పోషించనుంది. మోల్నుపిరవిర్‌ను ఎంఎస్‌డీ ఫార్మా తరఫున మనదేశంలో ఆరేడు కంపెనీలు ఉత్పత్తి చేయనున్నాయి. ఇందులో డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, ఎమ్‌క్యూర్‌, సన్‌ ఫార్మా, టోరెంట్‌, హెటెరో తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికీ మోల్నుపిరవిర్‌ ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌) ని దివీస్‌ లేబొరేటరీస్‌ అందించనుంది.

* స్థానిక ఫార్మా కంపెనీలు మరికొన్ని నేరుగా మోల్నుపిరవిర్‌(Molnupiravir Covid)ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించడంతో పాటు అంతగా ఔషధ నియంత్రణ లేని దేశాలకు (అన్‌-రెగ్యులేటెడ్‌ మార్కెట్లకు) సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో నాట్కో ఫార్మా, లారస్‌ ల్యాబ్స్‌, ఆప్టిమస్‌ ఫార్మా, హానర్‌ ల్యాబ్స్‌, మైత్రి ల్యాబ్స్‌.. తదితర కంపెనీలు ఉన్నాయి.

* నాట్కో ఫార్మా సొంతంగా హైదరాబాద్‌, విశాఖపట్నంతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో మోల్నుపిరవిర్‌పై నిర్వహిస్తున్న క్లినికల్‌ పరీక్షలు చివరి దశకు వచ్చినట్లు సమాచారం. ప్రాథమిక ఫలితాలు వెలువడగానే మనదేశంలో ఈ ఔషధాన్ని విక్రయించడానికి అనుమతి కోసం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) కి దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

* ఆప్టిమస్‌ ఫార్మా ఇప్పటికే క్లినికల్‌ పరీక్షలను దాదాపుగా పూర్తిచేసి, మధ్యంతర ఫలితాల సమాచారంతో ఈ ఔషధానికి అనుమతి ఇవ్వాలని డీసీజీఐని కోరింది. మరికొంత సమాచారం ఇవ్వాలని డీసీజీఐ కోరడంతో, ఆప్టిమస్‌ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

త్వరలో అనుమతి?

మోల్నుపిరవిర్‌(Molnupiravir Covid)పై దేశీయ ఫార్మా కంపెనీలు కొన్నింటికి త్వరలో డీసీజీఐ అనుమతి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంఎస్‌డీ ఫార్మాకు అమెరికాలో యూఎస్‌ఎఫ్‌డీఏ అత్యవసర అనుమతి ఇస్తే, దాని ఆధారంగా మనదేశంలోనూ ఎంఎస్‌డీ ఫార్మాతో పాటు కొన్ని ఇతర ఫార్మా కంపెనీలకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇవ్వొచ్చని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. కరోనా ముప్పు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ జనవరి-ఏప్రిల్‌లో మూడో దశ ముప్పు ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా ప్రతి ఇంటికీ ‘కరోనా’ మందులతో ఒక కిట్‌ ఇస్తున్నాయి. ఇటువంటి కిట్లలో ‘మోల్నుపిరవిర్‌’ చోటు సంపాదిస్తుందని, అందువల్ల దీనికి గిరాకీ లేకపోవడమనేది ఉండదని ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి.

ఇవీ చదవండి: Molnupiravir Covid: మందుబిళ్లతో కొవిడ్‌ తీవ్రతకు కళ్లెం!

'ఈ నెలలోనే థర్డ్​ వేవ్​.. జనవరి-ఏప్రిల్‌ మధ్య తీవ్రస్థాయికి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.