47,350పైకి సెన్సెక్స్..
స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్‌ను భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 47,354 వద్దకు చేరింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 13,873 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు దన్నుగా నిలిచాయి. కరోనా కొత్త రకం భయాలున్నా ఈ స్థాయిలో సూచీలు పుంజుకోవడం విశేషం.
- ఎస్బీఐ, టైటాన్, ఎల్&టీ, ఇండస్ఇండ్ బ్యంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలను గడించాయి.
- హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోయాయి.