లాభాల్లోకి మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 63 పాయింట్ల వృద్ధితో కొనసాగుతోంది. ప్రస్తుతం 50,319 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి.. 14,819 పాయింట్ల వద్దకు చేరింది.
11:58 February 04

10:34 February 04
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ వంటి హెవీవెయిట్ షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
ఓ దశలో 50 వేల మార్క్ దిగువకు చేరిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ప్రస్తుతం 176 పాయింట్ల పతనంతో 50,079 వద్ద కదలాడుతోంది.
లాభాలు నష్టాలు
సెన్సెక్స్-30 షేర్లలో మహీంద్ర అండ్ మహీంద్ర 5 శాతానికి పైగా ఎగబాకింది. ఓఎన్జీసీ, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ఐటీసీ షేర్లు రాణిస్తున్నాయి. గత రెండు సెషన్లలో గణనీయంగా వృద్ధి చెందిన ఇండస్ఇండ్ షేరు విలువ 2.34 శాతం పడిపోయింది. టైటాన్, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే పయనిస్తున్నాయి. టోక్యో, హాంకాంగ్, సియోల్, షాంఘై షేర్ మార్కెట్లలో బేర్ హవా సాగుతోంది.
ముడి చమురు
మరోవైపు, క్రూడ్ ఆయిల్ ధరలు 0.89 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 58.98 వద్ద ట్రేడవుతోంది.
09:18 February 04
సెన్సెక్స్ 191 పాయింట్లు పతనం
స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్లో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 191 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 50,064 వద్ద కదలాడుతోంది.
నిఫ్టీ సైతం 48 పాయింట్లు నష్టపోయి.. 14,741 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ షేర్లలో ఎం&ఎం, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ షేర్లు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.