రిలయన్స్ జోరు
300 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(sensex live).. ప్రస్తుతం కాస్త నెమ్మదించింది. 149 పాయింట్ల వృద్ధితో 58,268 వద్ద ట్రేడవుతోంది. అటు.. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 17,365 వద్ద కదులుతోంది.
కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు(reliance share price) షేరు దుమ్ము రేపుతోంది. గత సెషన్లో జీవితకాల గరిష్ఠాలకు చేరిన ఈ షేరు.. సోమవారం సైతం తన జోరు కొనసాగించింది. సుమారు 3 శాతం లాభంతో ప్రస్తుతం ట్రేడవుతోంది.
బుల్ జోరుతో నిఫ్టీలో రికార్డు సృష్టిస్తోంది రిలయన్స్. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 16.7 లక్షల కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఇది టీసీఎస్‌తో పోలిస్తే 18 శాతం అధికం.