కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం జోరు కొనసాగించిన దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో జీవితకాల గరిష్ఠాలను తాకిన సూచీలు ఆఖర్లో కిందికి దిగివచ్చాయి. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల్లో మదుపర్లు భారీగా లాభాల స్వీకరణకు పాల్పడ్డారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 20 పాయింట్లు కోల్పోయి.. 51 వేల 329 వద్ద స్థిరపడింది. ఒకానొకదశలో ఈ సూచీ దాదాపు 500 పాయింట్ల లాభంతో 51 వేల 836కు చేరింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 6.5 పాయింట్లు నష్టపోయి.. 15 వేల 109 వద్ద సెషన్‌ను ముగించింది.
లాభనష్టాల్లోనివివే..
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 3 శాతానికిపైగా లాభపడ్డాయి.
ఐఓసీ, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా పతనమయ్యాయి.
ఆసియా సూచీలూ లాభాల బాటే..
ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో సూచీలు లాభాల్లో ముగిశాయి. సియోల్ స్వల్పనష్టాలతో ముగిసింది.