బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 157.15 పాయింట్లు(0.49 శాతం), జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 53.40 పాయింట్ల(0.49 శాతం) లాభంలో కొనసాగుతున్నాయి. ఆర్థిక, లోహ, ఉత్పాదక వస్తు రంగాల్లో కొనుగోళ్లు ఉభయ సూచీలకు ఊతమిస్తున్నాయి.
సెన్సెక్స్ 36,544.86 పాయింట్లు, నిఫ్టీ 11,024.85 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్లో సెన్సెక్స్ సూచీ 378.73 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 1.14 శాతం వృద్ధి సాధించింది.
బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, వేదాంత షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.
ఎన్డీఏనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపాయి.
- దేవాంగ్ మెహతా, సెంట్రమ్ వెల్త్ మేనేజిమెంట్ సారథి
ఆసియా మార్కెట్లలో మదుపరులు జాగ్రత్త వహిస్తున్నారు. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నారు.