అంతర్జాతీయ, దేశీయ స్టాక్ మార్కెట్లు కరోనా భయంతో కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ భారీగా క్షీణించి 29 వేల దిగువకు చేరుకోగా.. అదే దారిలో నిఫ్టీ కొనసాగుతోంది. ఈ క్రమంలో మదుపరులు ఊహించని రీతిలో సంపదను కోల్పోతున్నారు. నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 19.49 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ గురువారం 581 పాయింట్లు కోల్పోయి 28,888 వద్ద స్థిరపడింది. నాలుగు రోజుల్లో 5,815 పాయింట్ల మేర నష్టపోయింది.
30-షేర్ ఇండెక్స్ సెన్సెక్స్ వరుసగా నాలుగు రోజులు భారీ నష్టాలను మూటగట్టుకున్న తరుణంలో సంపద రూ.19,49,461.82 కోట్లు ఆవిరైంది. ఫలితంగా మదుపరుల మొత్తం సంపద రూ.1,09,76,781 కోట్లకు తగ్గింది.
ఇదీ చూడండి: అవే భయాలు... మళ్లీ భారీగా నష్టపోయిన మార్కెట్లు