ETV Bharat / business

కీలక రంగాల దూకుడు- భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు - స్టాక్​ మార్కెట్​

stocks live
స్టాక్​మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్
author img

By

Published : Oct 18, 2021, 9:21 AM IST

Updated : Oct 18, 2021, 3:43 PM IST

15:39 October 18

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

ఇంధన ధరల్లో పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు.. దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలతో దేశీయ మార్కెట్లో బుల్​ జోరు కొనసాగింది. ఒకానొక దశలో భారీ లాభాలతో సూచీలు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. చివరకు సెన్సెక్స్​ 460 పాయింట్ల వృద్ధితో 61,765 పాయింట్ల వద్ద స్థిరపడింది

నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 18,477 వద్ద ముగిసింది.  

10:55 October 18

మదుపరులు కొనుగోళ్లకు పెద్ద ఎత్తున మొగ్గు చూపిన వేళ.. స్టాక్​మార్కెట్లు మరోసారి జీవన కాల గరిష్ఠాలను తాకాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 549 పాయింట్లకుపైగా లాభంతో 61,787 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 161 పాయింట్లకుపైగా పెరిగి 18,500 వద్ద కొనసాగుతోంది.

ఒకానొక దశలో నిఫ్టీ 160 పాయింట్లకు పైగా లాభపడి 18,500 మార్కును తాకింది. మరో సూచీ సెన్సెక్స్​ కూడా 500 పాయింట్లకు పైగా బలపడి జీవనకాల గరిష్ఠమైన 61,894 ను చేరింది.

టాటా స్టీల్​, ఇన్ఫోసిస్​​, ఎస్​బీఐ, పవర్​గ్రిడ్​, టైటాన్​, బజాజ్ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఏసియన్​ పెయింట్స్​,హెచ్​సీఎల్​ టెక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, డాక్టర్​ రెడ్డీస్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:02 October 18

స్టాక్​మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్

స్టాక్ మార్కెట్లు (Stock Market today) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 448 పాయింట్లకుపైగా లాభంతో 61,753 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 126 పాయింట్లకుపైగా పెరిగి 18,467 వద్ద కొనసాగుతోంది.

టాటా స్టీల్​, ఎం అండ్​ ఎం​, పవర్​గ్రిడ్​, టైటాన్​, బజాజ్ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

బజాజ్​ ఆటో, రిలయన్స్​, ఏసియన్​ పెయింట్స్​, హిందుస్థాన్​ యూనిలివర్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Oct 18, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.