ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భారత వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేసిన వేళ.. దేశీయ సూచీలు మరింత ఉత్సాహంగా పరుగులు పెడుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్.. 51,073 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 323 పాయింట్ల లాభంతో 50,937 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ.. 83 పాయింట్ల వృద్ధితో 14,978 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.