అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్న వేళ దేశీయ సూచీలు ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 25 పాయింట్లు పెరిగి 35,662 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 7 పాయింట్లు మెరుగై 10,444.5 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
అలా పెరిగి.. మళ్లీ మొదటికి..
కరోనా ప్రభావంతో మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్దీపన చర్యలు చేపడుతారన్న అంచనాలతో అగ్రరాజ్య మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి.
ఫలితంగా సెన్సెక్స్ తొలుత 308 పాయింట్లు లాభపడింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న కారణంగా మళ్లీ సూచీలు కిందికి జారాయి.
లాభనష్టాల్లో..
రిలయన్స్, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఇన్ఫోసిస్, ఐటీసీ, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్‌టెక్, సన్‌ఫార్మా, కొటక్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి విలువ
రూపాయి మారకం విలువ 33 పైసలు బలపడి డాలరుతో పోలిస్తే 73.84 వద్ద కొనసాగుతోంది.
బ్రెంట్ ముడి చమురు ధర 3.41 శాతం పెరిగి బ్యారెల్‌కు 38.49 డాలర్లకు చేరుకుంది.