ETV Bharat / business

'స్టాక్స్​'లో పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా? - స్టాక్​ మార్కెట్లలో పెట్టుబడులు

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో స్టాక్ మార్కెట్​ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంటున్నాయి. ఒకరోజు భారీగా పడిపోతున్నాయి. మరోరోజు లాభాలను చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టొచ్చా? పెడితే ఏ రంగానికి చెందిన కంపెనీలను ఎంచుకోవాలి?

stock markets
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : May 9, 2021, 8:31 AM IST

గతేడాది ప్రారంభమైన కరోనా మహమ్మారి వల్ల స్టాక్ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు లోనయ్యాయి. ఆ సంవత్సరం మార్చి, ఏప్రిల్ సమయంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు కనిష్ఠానికి పడిపోయాయి. తర్వాత రికవరీ అయిన సూచీలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవన కాల గరిష్ఠాలను తాకాయి. ఆ స్థాయి నుంచి మళ్లీ వెనక్కి వచ్చి.. ప్రస్తుతం అంతకంటే తక్కువ పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో కరోనా తగ్గుముఖం పడుతుండటం, ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి గాడిన పడుతుండటంతో మార్కెట్లలో స్థిరత్వం వస్తుందని భావించారు. మార్కెట్లు కూడా దీనికి తగిన విధంగా స్పందించాయి. ఇంతలో కరోనా రెండో విడత వల్ల సూచీలు.. మళ్లీ అస్థిరత్వానికి గురవుతున్నాయి. 2021 ఫిబ్రవరి మొదటి నుంచి మార్చి 4 వరకు చూసుకుంటే బొంబాయి స్టాక్​ ఎక్చేంజీ సూచీ సెన్సెక్స్ రోజుకు సరాసరిగా 800 పాయింట్లు(రోజు వారీ గరిష్ఠం కనిష్ఠం మధ్య తేడా) వరకు కదిలింది. కరోనా మహమ్మారి ముందు ఇంత అస్థిరత లేదు. రోజుకు గరిష్ఠంగా 500 పాయింట్ల రేంజ్​లో కదలాడేది.

కారణాలు..

ప్రస్తుత మార్కెట్ల అనిశ్చితికి ప్రధాన కారణం కరోనానే. రెండో విడతలో రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్​లో మొదట ఎక్కువ కేసులు మహారాష్ట్ర, దిల్లీలో నమోదయ్యాయి వాటికి అనుగుణంగా అక్కడ లాక్​డౌన్ లాంటివి విధించారు. దీంతో మార్కెట్లు ఎక్కువ నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు కూడా కేసుల సంఖ్య విషయంలో దాదాపు మార్పు లేనప్పటికీ... మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది కొంత ఊరట కలిగించేదే. భారీ నష్టాలు తప్పుతున్నాయి.

రెండో దశ విజృంభణతో పరిశ్రమల్లో కార్మికుల లభ్యత తగ్గే ప్రమాదం ఉంది. దీనితో పూర్తి సామర్థ్యంతో పనిచేసే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. అంతేకాకుండా కరోనా భయాలు, భవిష్యత్​పై ఆందోళనతో కొనుగోళ్లు తగ్గుతాయి. దీనివల్ల వస్తు సేవలకు డిమాండ్ పడిపోతుంది. తద్వారా ఆర్థిక కార్యకలాపాలు క్షీణిస్తాయి. ఫలితంగా.. వృద్ధి రేటు తగ్గుతుంది. ఈ భయాలతోనే పెట్టుబడిదారులు సందిగ్ధంలో ఉన్నారు.

" ప్రస్తుతం మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పటికీ ఒక స్థాయిలోనే సూచీలు పైకి కిందకు కదలాడుతున్నాయి. కింది స్థాయిలో మంచి మద్ధతు కనిపిస్తోంది. అదే ఎక్కువగా పైకి కూడా వెళ్లటం లేదు. కరోనా కేసులు తగ్గుముఖం పడితే మళ్లీ మంచి ప్రదర్శన కనబరుస్తాయని విశ్లేషకులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లలో అస్థిరతకు కారణం కరోనా సెకండ్ వేవ్. గతేడాది కంటే ఇప్పుడు కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వ్యాప్తీ ఎక్కువే. గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా విస్తరిస్తోంది. వీటికి అనుగుణంగానే మార్కెట్లు స్పందిస్తున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండకుండా.. రెండు నెలల్లో కేసులు తగ్గుముఖం పడితే మార్కెట్లు మళ్లీ మంచి ప్రదర్శనను కనబరుస్తాయి."

- సతీష్ కంతేటి , సంయుక్త ఎండీ, జెన్‌ మనీ.

అంతర్జాతీయంగా మార్కెట్లు కొత్త జీవన కాల గరిష్ఠాలను తాకుతున్నాయి. సూచీలు ఎక్కువ కరెక్షన్ కాకపోవటానికి ఇది కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అక్కడి మార్కెట్లు కరెక్ట్ అయితే దానికి తోడు.. కరోనా ప్రభావంతో దేశీయ సూచీలు కొంత ఎక్కువగా పడిపోయే ఆస్కారం ఉందని వారు చెబుతున్నారు.

పెట్టుబడులు..

ప్రస్తుతం కరోనా రెండో విడత ఎంత కాలం కొనసాగుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అనిశ్చితి కొనసాగుతున్నందున ఏ విధంగా స్పందిస్తాయన్నది ఇంకా చూడాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విడతల వారీగా పెట్టుబడి పెట్టాలని వారు సూచిస్తున్నారు.

ఏఏ రంగాలు...

స్వల్ప కాలంలో మార్కెట్లపై కరోనా వల్ల ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. ఎంత స్థాయిలో ఉంటుందన్నదానిపై వేచి చూడాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా ప్రభావం త్వరగా తగ్గి... మూడు, నాలుగు నెలల్లో ఆర్థిక వ్యవస్థ మార్చి స్థాయిలకు వస్తుందా? లేదా? అన్న దానిపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు వారు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఫార్మా రంగ షేర్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. కరోనా వల్ల వాటికి డిమాండ్ పెరగటమే కారణం. ఐటీ రంగం కూడా మెరుగైన ప్రదర్శనను చూపిస్తోంది. స్వల్ప కాలంలో వీటిలో పెట్టుబడులకు చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ధరల పెరుగుదల వల్ల వ్యవసాయ సంబంధిత కంపెనీలు లాభపడతాయి. సెకండ్ వేవ్ అనంతరం నిధుల కోసం ప్రభుత్వం ప్రైవేటీకరణ బాట పడుతుందని భావిస్తున్నారు. మధ్యస్థ కాలంలో ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

" ప్రస్తుతం వ్యవసాయ కమోడిటీస్ ధరలు పెరుగుతున్నాయి. అంచనా వేస్తున్నట్లు ఋతుపవనాలు బాగుంటే కనుక వ్యవసాయ సంబంధిత రంగాల్లో మార్కెట్ దృష్టి సారిస్తుంది. అంతేకాకుండా సెకండ్ వేవ్ వల్ల ఆర్థిక వ్యవస్థపై కలిగిన ప్రతికూల ప్రభావం విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నిధుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి, రెండు త్రైమాసికాల్లో వీటికి సంబంధించిన కంపెనీలు మంచి ప్రదర్శన కనబరుస్తాయని భావిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్ దృష్టి అంతా ఫార్మా రంగంపై ఉంది. ఐటీ రంగాల్లో కూడా స్వల్ప కాల వ్యవధితో పెట్టుబడులు పెట్టుకోవచ్చు."

ఇదీ చూడండి:వాహన రుణం తీసుకోవాలా.. అయితే ఇవి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.