రూపాయి పతనంతో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు రూ.161 పెరిగి రూ.52,638కు చేరుకుంది.
వెండి ధర భారీగా పెరిగింది. కిలోకు రూ.800 పైకెగిసి రూ.68,095 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్ల పతనం కూడా లోహాల ధరలపై ప్రభావం చూపినట్లు రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు శ్రీరామ్ అయ్యర్ తెలిపారు.
అమెరికా డాలరు విలువ పెరుగుదల, దేశీయ మార్కెట్ల పతనంతో రూపాయి మారకం విలువ 21 పైసలు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 73.60 వద్ద రూపాయి స్థిరపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1,960 డాలర్ల వద్ద కొనసాగుతుంది. వెండి ధర ఔన్సుకు 27.80 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: భారత్, చైనా ఉద్రిక్తతలతో కుప్పకూలిన మార్కెట్లు