బంగారం ధర పది గ్రాములకు నేడు దిల్లీలో రూ.3 తగ్గింది. రూ.38 వేల 535 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర రూ.91 తగ్గి రూ.45 వేల 293కి చేరింది.
బంగారానికి ప్రస్తుతం డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1,457 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 17 డాలర్లు.