బంగారం ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.111 పెరిగి రూ.42,492కు చేరుకుంది.
"దిల్లీలో 24 కారెట్ల బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. 10 గ్రాముల పసిడిపై రూ.111 పెరిగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవటమే ఇందుకు కారణం. పెళ్లిళ్ల సీజన్ కావటం వల్ల బంగారం డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది."
-తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్
వెండి కిలోకు రూ.67 తగ్గి రూ.48,599కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,609 డాలర్లకు చేరగా.. వెండి 18,.26 డాలర్లుగా ఉంది.