కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ తగ్గటం వల్ల దేశ రాజధాని దిల్లీలో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.372 తగ్గి రూ.38,975 వద్ద స్థిరపడింది.
"బంగారం ధరలు అధికంగా ఉన్నందున ఇప్పటి వరకు పండుగల కొనుగోళ్లు ఊపందుకోలేదు. దాని వల్ల ధరలు తగ్గాయి."
-తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్.
వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.1,150 తగ్గి రూ.48,590 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లు స్తబ్దుగా కొనసాగాయి. న్యూయార్క్లో ఔన్సు బంగారం ధర 1,490 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్సుకు18.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: డేటా వార్ 2.0: జియో గిగాఫైబర్ X ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్