బంగారం ధర బుధవారం స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర బుధవారం రూ.229 తగ్గి.. రూ.47,074 వద్దకు చేరింది.
వెండి ధర కిలోకు భారీగా రూ.717 తగ్గి.. రూ.70,807 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,832 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 27.38 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
అమెరికా ట్రెజరీ బాండ్లలో వచ్చే లాభాల పెరుగుదల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు దిగివస్తున్నట్లు నిపుణులు విశ్లేషించారు.
ఇవీ చదవండి: వెంటాడిన లాక్డౌన్ భయాలు- 49000 దిగువకు సెన్సెక్స్