పసిడి, వెండి ధరలు తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర స్వల్పంగా రూ.97 తగ్గి.. 47,853 వద్దకు చేరింది. కిలో వెండి ధర సైతం భారీగా పతనమైంది. వెండి ధర రూ.1,417 (కిలోకు) తగ్గి.. రూ.71,815(దిల్లీలో) వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా మిశ్రమ సూచీల ఆధారంగా బంగారం ధరలు ప్రభావితం అవుతున్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,867 డాలర్లుగా ఉంది. వెండి ఔన్సుకు 27.88 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇవీ చదవండి: నష్టాలతో ముగిసిన మార్కెట్లు- 50వేల దిగువకు సెన్సెక్స్