వడ్డీరేట్లపై యూఎస్ ఫెడ్ తీసుకునే నిర్ణయాలపైనే దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఆధారపడనున్నాయి. (Stock Market next week outlook) ఈ వారం.. దేశంలో ఆర్థిక గణాంకాలేవీ విడుదలయ్యే అవకాశం లేని నేపథ్యంలో.. ఇతర అంతర్జాతీయ పరిణామాలపై మదుపర్లు దృష్టిసారించనున్నారు.
గత వారం మార్కెట్లు రికార్డు లాభాలను నమోదు చేశాయి. శుక్రవారం సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరాయి. టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల్లో సంస్కరణలు మార్కెట్ సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చాయి. ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉండటం సైతం మార్కెట్ల బుల్ రన్‌కు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఈ వారం మాత్రం అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నాయని అంటున్నారు. (market outlook for next week)
"ఇటీవల అంచనాలకు మించి రాణించిన నేపథ్యంలో.. ఇండియా మార్కెట్లకు ఈ వారం చాలా కీలకం. అంతర్జాతీయంగా కొన్ని బలహీన సంకేతాలు ఉన్నాయి. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మీటింగ్ సెప్టెంబర్ 21-22 తేదీల్లో జరగనుంది. ఇది మార్కెట్ గమనాన్ని నిర్దేశించడంలో కీలకం కానుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ సైతం తన ద్రవ్య విధానాన్ని సెప్టెంబర్ 22న విడుదల చేయనుంది. ఇది కూడా మార్కెట్‌పై ప్రభావం చూపేదే."
-సంతోష్ మీనా, స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్
డాలర్ ఇండెక్స్, అమెరికా బాండ్లపై వచ్చే రాబడి (US bond yield) సైతం దేశంలో మార్కెట్లను ప్రభావితం చేస్తుందని మీనా తెలిపారు. 'ప్రస్తుతం మన మార్కెట్లలో బుల్ రంకెలేస్తోంది. దీర్ఘకాలంగా చూసుకుంటే.. ఇది 2-3 ఏళ్ల వరకు కొనసాగవచ్చు. కానీ, షార్ట్ టర్మ్‌లో మార్కెట్లు కరెక్షన్కు గురవుతాయి' అని పేర్కొన్నారు.
అమెరికా ఫెడ్ రిజర్వ్ (US federal reserve) మీటింగ్‌కు ముందు మార్కెట్లు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ హెడ్ సిద్ధార్థా ఖేమ్కా పేర్కొన్నారు.
దీంతో పాటు విదేశీ సంస్థాగత మదుపర్ల కదలికలు, రూపాయి- డాలర్ మారకం విలువ, ముడి చమురు ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
టాప్ 10 కంపెనీల ఎం-క్యాప్ ఇలా..
నాలుగు అతిపెద్ద సంస్థలైన భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం.. రూ. 65,464.41 కోట్ల మేర పెరిగింది. ఎయిర్టెల్ ఎం-క్యాప్ విలువ రూ. 22,984.14 కోట్లు ఎగబాకి.. రూ. 3,99,901.97 కోట్లకు చేరింది. మరోవైపు, టాప్ 10 లిస్ట్‌లో ఉన్న.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ. 43,746.79 కోట్ల మేర పతనమైంది.
ఇదీ చదవండి: