ETV Bharat / business

స్టాక్ మార్కెట్లలో ఈ వారమూ బుల్ జోరు కొనసాగేనా? - షేర్ మార్కెట్ ఔట్​లుక్

ఈ వారం స్టాక్ మార్కెట్లను అంతర్జాతీయ పరిణామాలు ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం నూతన శిఖరాలను తాకిన సూచీల జోరు ఈ వారం కూడా కొనసాగుతుందా? అనే విషయంపై నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి.

stocks market expectations for this week
ఈ వారం స్టాక్ మర్కెట్ల అంచనా
author img

By

Published : Aug 15, 2021, 12:47 PM IST

కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటన దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దీనితో స్టాక్ మార్కెట్లకు ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయంటున్నారు విశ్లేషకులు. ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పని చేయనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

  • మొహర్రం సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్లకు సెలవు.

ఆర్థిక అంశాల పరంగా చూస్తే.. సోమవారం టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఈ లెక్కలు మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. విదేశీ సంస్థగత పెట్టుబడులు కూడా దేశీయ మదుపరుల సెంటిమెంట్​పై ప్రభావం చూపొచ్చని అంటున్నారు.

ఇటీవల రికార్డులను తిరగరాస్తూ.. కొత్త గరిష్ఠాలకు చేరిన మార్కెట్ల జోరు ఇంకా కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"సానుకూల ఆర్థిక గణాంకాలు.. దేశార్థికం తేరుకుంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. దీనితో దీర్ఘకాలంలో మార్కెట్లలో బుల్​ జోరు కొనసాగే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో స్వల్ప దిద్దుబాటు ఉండొచ్చు."

-వినోద్ నాయర్​, జియోజిత్​ ఫినాన్షియల్ సర్వీసెస్​ పరిశోధనా విభాగాధిపతి

వీటన్నింటితో పాటు.. డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, కరోనా కేసులు, వ్యాక్సినేషన్​ వార్తలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి: మన కుర్రాళ్లు అల్లరోళ్లేం కాదు.. లెక్కలన్నీ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.