నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. భారీ లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాజపా జోరు తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 7 పాయింట్ల నష్టంతో 39,051 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ - నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 11,595 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి..
హెచ్‌సీఎల్ టెక్, ఐచర్ మోటర్స్, టెక్ మహీంద్ర, ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఎస్ బ్యాంక్, లార్సెన్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ షేర్లు సుమారు 2 శాతం లాభపడ్డాయి.
భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫినాన్స్, హీరో మోటోకార్ఫ్లు 2 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 7 పైసలు లాభపడి రూ.70.84 వద్ద కొనసాగుతోంది.