దేశవ్యాప్తంగా డైరీ రైతులకు దాణా సమస్యలు తగ్గించేందుకు... హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న అగ్రిటెక్ అంకురం 'కార్నెక్ట్స్' ఓ కార్యక్రమాన్ని ప్రకటించింది. దేశీయంగా తాము తయారు చేసిన సైలేజ్ తయారీ యంత్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా మార్చి... దాణా కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు.
సైలేజ్‌ను రైతుల నుంచి డైరీకి పంపించేందుకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను విడుదల చేశారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న నాణ్యమైన దాణా సమస్యను నివారించటంతోపాటు పాల ఉత్పత్తిని కూడా పెంచవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రిలయన్స్‌లోకి మరో రూ.5,512కోట్ల పెట్టుబడులు