ETV Bharat / business

'మే'లో దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం.. -3.21 శాతంగా నమోదు - fuel inflation may 2020

ఇంధన, విద్యుత్​ ధరల పతనంతో టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020 మేలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం -3.21 శాతంగా నమోదైందని ప్రకటించింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం మాత్రం 1.13 శాతానికి పెరిగినట్లు స్పష్టం చేసింది.

WPI inflation
టోకు ద్రవ్యోల్బణం
author img

By

Published : Jun 15, 2020, 2:18 PM IST

Updated : Jun 15, 2020, 4:16 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) -3.21 శాతానికి దిగొచ్చింది. ఇంధనం, విద్యుత్​ ధరల పతనమే ఇందకు కారణమని కేంద్రం ప్రకటించింది. అయితే ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 1.13 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.

  • 2020 మే నెలకు గాను టోకు ద్రవ్యోల్బణం -3.21 శాతంగా నమోదైంది. గతేడాది మే నెలలో ఇది - 2.79 శాతంగా ఉంది.
  • విద్యుత్​, ఇంధన ద్రవ్యోల్బణం -19.83 శాతానికి పడిపోయింది. గత నెలలో -10.12 శాతం నమోదైంది.
  • ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 1.13 శాతం. ఏప్రిల్​లో ఇది 2.55 శాతంగా నమోదైంది.
  • తయారీరంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం -0.42 శాతం

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్​డౌన్​ కారణంగా ఎలక్ట్రానిక్​ విధానంలో ధరల సమాచారాన్ని సేకరించినట్లు కేంద్రం వెల్లడించింది. ఎంపిక చేసిన సంస్థాగత వర్గాలు, పరిశ్రమల నుంచి నేషనల్​ ఇన్​ఫర్మేటిక్స్​ సెంటర్​ (ఎన్​ఐసీ) వెబ్​సైట్​ ద్వారా డేటాను గ్రహించినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం 9.28 శాతం

Last Updated : Jun 15, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.