ETV Bharat / business

తీవ్ర ఆర్థిక మాంద్యం తథ్యం: ఐఎంఎఫ్​ - కరోనా వైరస్​

2020లో ప్రపంచ దేశాలు తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కోక తప్పదని ఐఎం​ఎఫ్​ హెచ్చరించింది. అనేక ఆటుపోట్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తరుణంలో.. కరోనా వైరస్​ రూపంలో అతిపెద్ద భారం పడిందని ఐఎం​ఎఫ్​ చీఫ్​ క్రిస్టాలినా జార్జివా అభిప్రాయపడ్డారు.

World economy bound to suffer 'severe recession': IMF
'ఆర్థిక వ్యవస్థపై వైరస్​ దెబ్బ.. తప్పని ఆర్థిక మాంద్యం'
author img

By

Published : Apr 18, 2020, 1:34 PM IST

అనేక ఆటుపోట్ల నుంచి కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్​ రూపంలో అతిపెద్ద భారం పడిందని ఐఎం​ఎఫ్​ అభిప్రాయపడింది. ఫలితంగా ప్రపంచ దేశాలు తీవ్రస్థాయి ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోక తప్పదని ఐఎం​ఎఫ్​ సారథి​ క్రిస్టాలినా జార్జివా అంచనా వేశారు. వర్ధమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల(ఈఎమ్​డీఈ)కు ప్రస్తుత సంక్షోభం ఎన్నో సవాళ్లను విసిరిందని తెలిపారు.

ఈ ఏడాది తొలి భాగంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంగిపోవడం అనివార్యమని.. ఐఎం​ఎఫ్​ వార్షిక సమావేశంలో తెలిపారు క్రిస్టాలినా. వాణిజ్య యుద్ధం, విధానాలపై ఉన్న అనిశ్చితి, ప్రాంతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతతో అతలాకుతలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్​ భారం అదనంగా పడిందన్నారు.

"మధ్యంతర అంచనాలపై అనిశ్చితి నెలకొంది. వైరస్​ విజృంభిస్తున్న తీరు ఇందుకు కారణం. వైరస్​ కట్టడికి చేపట్టిన లాక్​డౌన్ వంటి చర్యలతో మరింత నష్టం జరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. కరోనా వైరస్​ వల్ల తీవ్ర మాంద్యంలోకి జారుకోనుంది."

-- క్రిస్టాలినా జార్జివా, ఐఎం​ఎఫ్​ చీఫ్​.

ఇదీ చూడండి:- త్వరలో మార్కెట్లోకి 'నోకియా 9.3' వచ్చేస్తోందోచ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.