ఎన్డీఏ ప్రభుత్వంలో సులభతర వాణిజ్యంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో వ్యాపార అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు, జీఎస్టీలో అవసరానికి తగిన మార్పులు చేశామన్నారు.
అసోచామ్ ఏర్పాటై వందేళ్లు అయిన సందర్భంగా దిల్లీలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై ప్రసంగించారు.
"ఐదారేళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లింది. మా సర్కారు వచ్చాక అందులోనుంచి బయట పడేసి క్రమశిక్షణ అలవరిచాం. సులభతర వాణిజ్యంలో 190 దేశాల్లో భారత్ 149 ర్యాంకులో ఉండేది. మూడేళ్ల తర్వాత 63కు వచ్చింది. కంపెనీల చట్టంలో చిన్న చిన్న తప్పులకూ క్రిమినల్ చర్యలు ఉండేవి. ఇవే మీ ఆందోళనకు కారణం. అటువంటి ఎన్నో నిబంధనలను క్రిమినల్ చర్యల నుంచి మినహాయించాం. మరిన్ని నిబంధనలను పరిశీలిస్తున్నాం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'నిజాం నిధుల కేసులో పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ'