ద్రవ్యోల్బణం తక్కువగానే ఉండటంతో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను 25 పాయింట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు ఎస్బీఏ పరిశోధన నివేదిక తెలిపింది.
ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ-ఎమ్పీసీ) నేటి నుంచి మూడు రోజుల పాటు ముంబయిలో సమావేశం కానుంది. అనంతరం ఫిబ్రవరి 7న నిర్ణయాన్ని వెలువరించనుంది.
వరుసగా రెండు సార్లు వడ్డీ రేట్లను 25 పాయింట్లు పెంచిన అనంతరం.. గత మూడు సమీక్షల్లో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంతో పాటు వృద్ధి నెమ్మదిస్తోంది. ఫలితంగా, వృద్ధికి ఊతమిచ్చే విధంగా వడ్డీ రేట్లును తగ్గించే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. రుణాల పెరుగుదల జనవరి చివరి అర్ధభాగంలో తగ్గిపోయింది.
దీనితో పాటు చిన్న తరహా పరిశ్రమలకు డిసెంబర్లో రుణ లభ్యత పెరిగింది. దీనికి ప్రభుత్వం అమలు చేసిన ఎమ్ఎస్ఎమ్ఈ అవుట్రీచ్ కార్యక్రమం దోహదపడింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల కార్పొరేట్ బాండ్ల విడుదల డిసెంబర్లో మూడు నెలల కనిష్ఠమైన రూ. 25 వేల 168 కోట్లకు చేరింది.