ETV Bharat / business

క్యూ3లో అమెరికా జీడీపీ రికార్డ్​ స్థాయి వృద్ధి - అమెరికా జీడీపీ

కొవిడ్​ మహా విలయంలోనూ జులై-సెప్టెంబర్​ త్రైమాసికంలో రికార్డ్​ స్థాయిలో పుంజుకుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ. గతంలో ఎన్నడూ లేని విధంగా 33.1 శాతం మేర వృద్ధి చెందింది. అయితే.. కరోనా మళ్లీ విజృంభిస్తున్న కారణంగా ప్రస్తుత అక్టోబర్​-డిసెంబర్​ త్రైమాసికంలో వృద్ధి మందగించే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

US economy surges
క్యూ3లో రికార్డ్​ స్థాయిలో అమెరికా జీడీపీ వృద్ధి
author img

By

Published : Nov 26, 2020, 5:08 AM IST

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పుంజుకుంది. మూడో త్రైమాసికం జులై-సెప్టెంబర్​ కాలంలో 33.1 శాతం మేర వృద్ధి సాధించింది. నెల రోజుల క్రితం వేసిన అంచనల మేరకే ఫలితాలు ఉన్నాయని అగ్రరాజ్య వాణిజ్య విభాగం వెల్లడించింది. అయితే.. కొవిడ్​ వైరస్​ మళ్లీ పంజా విసురుతున్న క్రమంలో ప్రస్తుత త్రైమాసికంలో క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది.

స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో పెరుగుదల, దేశం మొత్తం వస్తు, సేవల ఉత్పత్తి.. గతంలో వేసిన అంచనా ప్రకారమే వృద్ధి కనబరిచినట్లు వాణిజ్య విభాగం వెల్లడించింది. అయితే.. కొన్ని విభాగాలను సవరించినట్లు తెలిపింది.

1947 నుంచి ఇప్పటి వరకు ఒక త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ధి రేటు ఈ స్థాయి(33.1శాతం)లో నమోదవటం ఇదే మొదటి సారి. గతంలో 1950లో 16.7 శాతం వృద్ధి నమోదైంది.

'క్యూ3లో భారీస్థాయిలో వృద్ధి నమోదైనప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకున్నట్లు కాదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దేశ జీడీపీ భారీగా నష్టపోయింది. తొలి త్రైమాసికంలో జీడీపీ వార్షిక రేటులో 5 శాతం, రెండో త్రైమాసికంలో 31.4 శాతం మేర క్షీణించింది. ప్రస్తుత అక్టోబర్​-డిసెంబర్​ త్రైమాసికంలో వృద్ధి రేటు మందగించే ప్రమాదం ఉందని, వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో జీడీపీ ప్రతికూల ఫలితాలు నమోదు చేయొచ్చు' అని అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు

ఇదీ చూడండి: భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.