2021 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ. 4.78లక్షల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో పింఛను కేటాయింపులు కూడా ఉన్నాయి. వీటిని తొలగిస్తే.. సైన్యానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు రూ. 3.62లక్షల కోట్లు.
మొత్తం కేటాయింపుల్లో రూ. 1.35లక్షల కోట్లను.. నూతన ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, ఇతర మిలిటరీ హార్డ్వేర్లను కొనేందుకు ఇచ్చింది కేంద్రం.
గతేడాది బడ్జెట్లో రక్షణ రంగానికి రూ. 4.71లక్షల కోట్లను కేటాయించింది కేంద్రం.
'బడ్జెట్లో ఉంది కానీ..'
రక్షణ రంగానికి కేటాయింపులు.. 2021 బడ్జెట్లో భాగమేనని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజివ్ కుమార్ వెల్లడించారు. అయితే అది.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో లేదని వివరణ ఇచ్చారు. ఆరోగ్యం వంటి ఆరు కీలక అంశాలపై నిర్మల దృష్టిసారించారని పేర్కొన్నారు. రక్షణ రంగానికి కేటాయింపులు ముఖ్యమే అయినప్పటికీ.. దేశ ప్రగతితో వాటికి తక్కువ సంబంధం ఉంటుందన్నారు. కేంద్రం.. 2021బడ్జెట్తో దేశ ప్రగతిని పరుగులు పెట్టించడంపై దృష్టిసారించారని తెలిపారు.
ఇవీ చూడండి:-