ETV Bharat / business

పట్టణాల్లో పది మందిలో ఒకరు నిరుద్యోగి! - ఆగస్టులో నిరుద్యోగ రేటు

ఆగస్టులో నిరుద్యోగులు మళ్లీ భారీగా పెరిగారు. పట్టణ ప్రాంతాల్లో నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడం వల్ల ఆగస్టులో నిరుద్యోగిత రేటు 8.35 శాతానికి పెరిగినట్లు సీఎంఐఈ డేటాలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి పదిమందిలో ఒకరు ఉద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఇందులో తేలింది.

Unemployment Rate in August
ఆగస్టులో పెరిగిన నిరుద్యోగ రేటు
author img

By

Published : Sep 2, 2020, 1:35 PM IST

సంఘటిత రంగాల్లో ఉద్యోగాలు తగ్గిపోవడం, వ్యవసాయ రంగంలో పంటలు వేసే సమయం దాదాపు ముగియటం వల్ల ఆగస్టులో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు మళ్లీ పెరిగింది.

సెంటర్​ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) డేటా ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 9.83 శాతానికి పెరిగింది. జులైలో ఇది 9.15 శాతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో ప్రతి పది మందిలో ఒకరికి ఉపాధి కరువైనట్లు సీఎంఐఈ సర్వే తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆగస్టులో నిరుద్యోగ రేటు 6.66 శాతం (జులైలో) నుంచి 7.65 శాతానికి పెరిగిందని సీఎంఐఈ వెల్లడించింది.

మొత్తం నిరుద్యోగ రేటు.. ఆగస్టులో 8.35 శాతానికి పెరిగినట్లు సీఎంఐఈ తెలిపింది. జులైలో ఇది 7.43 శాతంగా ఉండటం గమనార్హం. లాక్​డౌన్ ఉన్న మే, జూన్​తో పోలిస్తే జులైలో కాస్త తగ్గిన నిరుద్యోగ సమస్య ఆగస్టులో మళ్లీ పెరిగింది.

లాక్​డౌన్ ప్రారంభమైన మార్చి (8.75 శాతం)తో పోలిస్తే ఆగస్టులో నిరుద్యోగ సమస్య కాస్త తక్కువగానే ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, 2019 డిసెంబర్​లలో (7.22 శాతం నుంచి 7.76 శాతం) నిరుద్యోగ రేటుతో పోలిస్తే మాత్రం ఆగస్టులో నిరుద్యోగం భారీగా పెరిగింది.

రాష్ట్రాల వారీగా ఇలా..

ఆగస్టు నెల నిరుద్యోగ రేటులో హరియాణా 33.5 శాతంతో తొలి స్థానంలో, త్రిపుర (27.9 శాతం)తో రెండో స్థానంలో ఉంది. కర్ణాటకలో అత్యల్పంగా 0.5 శాతం నిరుద్యోగ రేటు నమోదవ్వగా.. ఒడిశా (1.4 శాతం) తర్వాతి స్థానంలో ఉంది.

ఉద్యోగాల కోతలు కొనసాగుతుండటం, డిమాండ్ లేమి, బలహీన ఆర్థిక వృద్ధి సంకేతాలు నిరుద్యోగ సమస్యను తీవ్రం చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:జీవిత బీమాకే 70 శాతం మిలీనియల్స్​ మొగ్గు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.