ETV Bharat / business

ఆ రెండు బ్యాంకుల ఉద్యోగులకు వీఆర్​ఎస్​! - ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్ ఉద్యోగులకు వీఆర్​ఎస్​

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం ప్రైవేటీకరణకు ఎంపిక చేయనున్న రెండు బ్యాంకులు.. తమ ఉద్యోగులకు వీఆర్​ఎస్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణకు ముందే మంచి ప్యాకేజీతో రిటైర్మెంట్ తీసుకోవాలనుకునే ఉద్యోగుల కోసం ఆయా బ్యాంకులు వీఆర్​ఎస్​ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

two PSBs Planning for come out with VRS
రెండు బ్యాంకుల ఉద్యోగులకు వీఆర్​ఎస్​
author img

By

Published : Jun 8, 2021, 5:45 PM IST

ప్రభుత్వం ప్రైవేటీకరణకు ఎంపిక చేయనున్న రెండు బ్యాంకులు తమ ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్​ఎస్​) ప్రకటించే వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే వీఆర్​ఎస్​ ఆఫర్ బలవంతంగా ఉద్యోగులను తప్పించేందుకు కాదని.. ప్రైవేటీకరణకు ముందే మంచి ప్యాకేజీతో రిటర్మెంట్ కోరుకునే వారి కోసమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు తెలిసింది.

గతంలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియకు ముందు కూడా వీఆర్​ఎస్​ను ప్రకటించడం గమనార్హం.

2021-22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఓ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రైవేటీకరణకు అనుగుణంగా ఉన్న బ్యాంకుల ఎంపిక బాధ్యతను నీతి ఆయోగ్​కు అప్పగించింది కేంద్రం.

ఇందుకు సంబంధించి నీతి ఆయోగ్​ నివేదికను ఇటీవల కేంద్రానికి సమర్పించింది. ఇందులో సెంట్రల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్ (ఐఓబీ)లను ప్రైవేటీకరణకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

అవసరమైన మార్పుల తర్వాతే..

నీతి ఆయోగ్​ ప్రతిపాదనను.. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌), ఆర్థిక సేవల విభాగం పరిశీలించి, చట్టపరంగా అవసరమైన మార్పులు చేస్తాయి. ప్రైవేటీకరణ ప్రక్రియ కాలపరిమితి కూడా ఈ మార్పులపైనే ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:Union Bank: నష్టాల ఊబిలో నుంచి లాభాల బాటలోకి...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.