ETV Bharat / business

బడ్జెట్ 2021: అంకురాల ఆశలు నెరవేరేనా? - బడ్జెట్​కు ఔత్సాహి పారిశ్రామిక వేత్తల సూచనలు

కరోనా సంక్షోభం సహా గతంలో ఎన్నడూ చూడని ప్రత్యేక పరిస్థితుల నడుమ ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. కరోనా వల్ల దేశీయంగా అంకురాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న పద్దుకు అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేతల సూచనలు ఏమిటి? ఎలాంటి ప్రోత్సహాకాలు కావాలని వారు కోరుతున్నారు?

What startups asking from Budget
అంకురాలు బడ్జెట్ నుంచి ఏం కోరుతున్నాయి
author img

By

Published : Jan 30, 2021, 10:15 AM IST

భారత అంకురాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్లో ఫిబ్రవరి 1న రాబోయే బడ్జెట్పై భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. బడ్జెట్​లో తుది వినియోగదారులకు ప్రోత్సాహకాలు ప్రకటించటం ద్వారా పారా-ఎడ్యూకేషన్ అంకురాలకు మద్దతు ఇవ్వాలని.. ప్రీ-స్కూల్ పిల్లలకు ఆంగ్లం బోధించేందుకు 'ఓకీపాకీ' అనే ఇంటరాక్టీవ్ యాప్ స్థాపకుడు అమిత్ అగర్వాల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను కోరారు.

కొవిడ్ నేపథ్యంలో పాఠశాలలు మూసివేసి ఉండటం వల్ల విద్యా రంగంలోని ఎడ్యూటెక్​ అంకురాలు భారీ వృద్ధిని సాధించాయి. భారతదేశంలో మెజార్టీ ప్రజలు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో జీవిస్తున్నందున.. చాలా మంది ఎడ్యూటెక్ కంపెనీల సేవలకు కావాల్సిన వ్యయాన్ని భరించలేరు. కాబట్టి ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇవ్వాలని లేదంటే.. విద్యా రంగంలో డిజిటల్ విభజన జరుగుతుందని అంకురాల వ్యవస్థాపకులు అంటున్నారు.

దేశంలో ఎడ్యూటెక్ అంకురాలివే..

భారత ఎడ్యూటెక్ అంకురాల్లో బైజూస్ లాంటి యూనికార్న్​తో పాటు అన్ అకాడమీ, అప్ గ్రాడ్, టాపర్, నెక్ట్స్ ఎడ్యూకేషన్, డోంట్ మెమోరైజ్ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. విద్యారంగంలోని అంకురాలను ఎడ్యూటెక్ కంపెనీలుగా సంభోదిస్తారు. గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించటం, ఇంగ్లీషు నేర్చుకోవటం, పోటీ పరీక్షలకు సన్నద్దం కావటం తదితర చాలా సేవలను ఇవి అందిస్తాయి.

మధ్యస్థ ఆదాయాలు ఉన్న తల్లిదండ్రులు, ముఖ్యంగా చిన్న నగరాలు పట్టణాల్లో ఉన్న వారికి అందుబాటు ధరల్లో ఉండటమనేది ప్రధాన సవాలని ఓకీపాకీ వ్యవస్థాపకుడు అమిత అగర్వాల్ అన్నారు. ఈయన అంకురాన్ని స్థాపించే ముందు యూట్యూబ్ ఇండియా హెడ్​గా పనిచేశారు.

"పారా-ఎడ్యూకేషన్​తో సహా విద్యకు సంబంధించి చెల్లించిన ట్యూషన్ ఫీజులపై సెక్షన్ 80సీ ప్రకారం మరిన్ని ప్రయోజనాలను ప్రభుత్వం కల్పించినట్లైతే.. అది పెద్ద పురోగతి అవుతుంది"

- అమిత్ అగర్వాల్​, ఓకీపాకీ వ్యవస్థాపకుడు

సెక్షన్ 80సీ ప్రకారం చెల్లించిన ట్యూషన్ ఫీజుపై ఆదాయపు పన్నుకు సంబంధించి రూ.1.5 లక్షల మినహాయింపు.. తల్లి లేదా తండ్రి, సంరక్షుడు, స్పాన్సర్ తీసుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనం డెవలప్మెంట్ ఫీజు, ప్రయాణ ఖర్చు, ఎడ్యూ టెక్ కంపెనీల ఫీజులకు వర్తించదు. ఈ విషయాలను ఆర్థిక మంత్రి బడ్జెట్లో పరిగణనలోకి తీసుకుని.. ఈ ఖర్చులను 100 శాతం మినహాయింపు ఇవ్వాలని అమిత్ 'ఈటీవీ భారత్' తో అన్నారు.

రుణాలకు ప్రత్యేక పథకాలు కావాలి..

కేవలం బడ్జెట్​లో పన్ను ప్రతిపాదనలే కాకుండా… ప్రభుత్వ ఫైనాన్స్​కు సంబంధించిన అంశాలుంటాయి. వివిధ రంగాలకు ఊతం ఇచ్చేందుకు బడ్జెట్లో ఆర్థిక మంత్రి పలు ప్రతిపాదనలు చేస్తారు. ఈ కొత్త తరహా విద్య, ప్రత్యేకించి ఎర్లీ ఎడ్యూకేషన్​కు సంబంధించి సులభంగా తల్లిదండ్రులు రుణాలు పొందేందుకు వీలుగా ప్రభుత్వం బడ్జెట్​లో కొన్ని పథకాలను ప్రకటించాలని అమిత్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

'బ్యాంకులు కళాశాల విద్య అనంతరం లాభాలను చూడగలుగుతున్నాయి కాబట్టి రుణాల వ్యవహారం కళాశాల స్థాయిలో ఉంది. విద్య అనంతరం ఉద్యోగం వస్తుంది కాబట్టి బ్యాంకు క్యాష్ ప్లో ఉంటుంది. కీలకమైన ఎర్లీ ఎడ్యూకేషన్ విషయంలో రుణ సదుపాయం లేదని.. రుణ సదుపాయం వస్తే.. ప్రైవేటు వ్యక్తులు విద్యా రంగంలోకి వచ్చి, నైపుణ్యాభివృద్ధికి పాల్పడుతారు. దాని వల్ల వ్యయం తగ్గుతుంది' అని అమిత్ అన్నారు.

కాంప్లియన్స్ భారం తగ్గించాలి

బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ అంకురాలకు సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారని వ్యవసాయ అంకురమైన సబ్జి కోఠి(కూరగాయల బాక్స్) ను స్థాపించిన బిహార్​కు చెందిన యువ ఔత్సాహికుడు నిక్కీ కుమార్ జా అభిప్రాయపడ్డారు. దేశంలో నవకల్పనలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటానికి జనవరి 2016లో నరేంద్ర మోదీ స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ కార్యక్రమంలో భాగంగా పన్ను ప్రయోజనాలతో పాటు పలు ప్రోత్సహకాలు ప్రకటించారు.

"ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురం అయినప్పటికీ… ఇతర కంపెనీల వలే ఆదాయ పన్ను రిటర్నులు, ఎంసీఏ రిటర్నులు తదితరాలను దాఖలు చేయాల్సి వస్తోంది. వీటి కోసం రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇది మా క్యాష్ ఫ్లోలపై ప్రభావం చూపెడుతోంది"

- నిక్కీ కుమార్, సబ్జి కోఠి వ్యవస్థాపకుడు

మా అంకురం ప్రారంభ దశలో ఉంది. ఇటీవలే బూట్ స్ట్రాప్ అయింది. ఈ కాంప్లియెన్స్ భారాన్ని భరించలేమని నిక్కీ కుమార్ 'ఈటీవీ భారత్' కు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త కంపెనీల విభాగాన్ని సృష్టించాలని, వీటిని బడ్జెట్ ద్వారా ప్రకటించవచ్చని అన్నారు. ఈ కంపెనీలకు స్టార్టప్ అనే పదం జోడించవచ్చని, తద్వారా డీపీఐఐటీ నుంచి తక్షణ గుర్తింపు లభించటమే కాకుండా తక్కువ కాంప్లియెన్స్ భారం ఉంటుందని పేర్కొన్నారు. వన్ పర్సన్ కంపెనీల లానే.. స్టార్టప్ కంపెనీ అని ప్రభుత్వం బడ్జెట్​లో నూతన కంపెనీల విభాగాన్ని ప్రకటించాలని ఆయన అన్నారు.

అలా అయితే ప్రోత్సాహం..

కార్పొరేట్ వ్యవహరాల శాఖల కమిటీ ఈనెల ప్రారంభంలో… ఎల్ఎల్​పీ చట్టాలన్ని సవరించి ఫీజులు, పెనాల్టీ, ఇతర కాంప్లియెన్స్ తగ్గించేందుకు కొత్త ఎల్ఎల్​పీ క్లాజ్​ను సృష్టించాలని ప్రతిపాదించింది. కమిటీ ప్రతిపాదన ప్రకారం.. ఈ విభాగంలోని కంపెనీల వార్షిక ఆదాయం రూ.40 లక్షలు లేదా భాగస్వామి వాటా రూ.25 లక్షల కంటే తక్కువ ఉండాలి. వీటికి కాంప్లియెన్స్ భారం తక్కువగా ఉండాలి. తద్వారా భాగస్వామ్య సంస్థలు, యాజమాన్య సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం లభిస్తుందని కమిటీ సూచించింది.

ఛార్టెడ్​ అకౌంటెంట్​ ఫీజుపై సబ్సిడీ..

మరో సమస్యను కూడా నిక్కీ కుమార్ ప్రధానంగా చెప్పారు. పేటెంట్ కోసం చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే ఈ సబ్సిడీ ప్రభుత్వం నుంచి పేటెంట్ ఇచ్చే అధికారికి అందిన అనంతరమే అంకురాలకు బదిలీ అవుతుందని నిక్కీ తెలిపారు. ఎప్పుడు సబ్సిడీ అందుతున్నదని తెలియకపోవటం వల్ల భవిష్యత్ ప్రణాళిక దెబ్బతింటోందని, క్యాష్ ఫ్లోపై ప్రభావం పడుతోందని నిక్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంప్లియెన్స్ వ్యయ భారం తగ్గించేందుకు ఛార్టెడ్ అకౌంటెంట్​కు చెల్లించిన ఆడిట్ ఫీజుపై ప్రభుత్వం సబ్సిడీ అందించాలని కోరుతున్నాడు. ప్రభుత్వం గుర్తించిన పేటెంట్ అటర్నీకి అంకురం చెల్లించిన ఫీజు విషయంలో ప్రభుత్వం 90 శాతం భరిస్తోంది. అదే విధంగా ఛార్టెడ్​ అకౌంటెంట్​కు చెల్లించిన ఫీజు పై కూడా సబ్సిడీ అందించాలి అని సూచించారు.

ఇదీ చూడండి:బడ్జెట్‌ సంజీవని అవుతుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.