ETV Bharat / business

పసిడి బాండ్ల ఇష్యూ షురూ- గ్రాముకు ఎంత? - సావరిన్ గోల్డ్ బాండ్స్​పై డిస్కౌంట్​

2021-22 తొలి విడత పసిడి బాండ్ల ఇష్యూను సోమవారం ప్రారంభించింది ఆర్​బీఐ. ఈ నెల 28 వరకు వీటిని కొనుగోలు చేసే వీలుంది. వీటని ఎలా సబ్​స్క్రైబ్​ చేసుకోవాలి? డిస్కౌంట్ ఎలా పొందాలి అనే పూర్తి వివరాలు మీకోసం.

1gm Sovereign Gold Bonds price
సావరిన్ గోల్డ్ బాండ్ల ధర
author img

By

Published : May 24, 2021, 3:01 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత సార్వభౌమ పసిడి బాండ్ల(ఎస్​జీబీ) ఇష్యూ సోమవారం ప్రారంభమైంది. గ్రాము బంగారం ధర రూ.4,842గా నిర్ణయించింది ఆర్​బీఐ. 2021 మే 28(శుక్రవారం) వరకు ఇవి సబ్​స్క్రిప్షన్​ కోసం అందుబాటులో ఉంటాయి. ఆన్​లైన్​, డిజిటల్​ పద్ధతిలో చెల్లింపులు చేసే మదుపర్లకు గ్రాముపై రూ.50 రాయితీ లభించనుంది.

ఏమిటి ఈ సార్వభౌమ పసిడి బాండ్లు?

సార్వభౌమ పసిడి బాండ్లు(ఎస్​జీబీ) ప్రభుత్వం అందించే బాండ్ల లాంటివే. ప్రభుత్వం తరఫున వీటిని ఆర్​బీఐ జారీ చేస్తుంది. ఎస్​జీబీలనూ గ్రాముల చొప్పునే తీసుకోవాల్సి ఉంటుంది.

2.5 శాతం రాబడి..

దేశీయంగా బంగారంపై పొదుపును మళ్లించేందుకు ఎస్​జీబీలను 2015లో ప్రవేశపెట్టారు. ఇది భౌతిక బంగారం కొనుగోలుకు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతుంటారు. వీటి ద్వారా భౌతికంగా బంగారం దాచిపెట్టుకోవటం వల్ల ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. వార్షికంగా 2.5 శాతం రాబడి అర్జించవచ్చు. వడ్డీని ఆరు నెలలకు ఒక సారి బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తారు. భౌతికంగా నగల్లో ఉండే మేకింగ్‌ ఛార్జీలు, స్వచ్ఛత, తరుగు లాంటి ఇబ్బంది వీటిలో ఉండదు.

ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌ ఉంటుంది. ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని ఉపసంహరించుకునే(ఎగ్జిట్‌ ఆప్షన్‌) అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదా మెచ్యూరిటీ పీరియడ్‌లో ఉన్న బంగారం ధర ప్రకారమే అప్పటి ధర నిర్ణయిస్తారు.

ఎంత పెట్టుబడి పెట్టొచ్చు?

ఒక వ్యక్తి కనీసం 1 గ్రాము నుంచి 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. హిందూ అవిభాజ్య సంస్థలకు కూడా 4కిలోల పరిమితి ఉంది. ట్రస్ట్‌లకు 20కిలోల గరిష్ఠ పరిమితి ఉంటుంది. ఈ పరిమితి ఒక ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఇష్యూలలో కలిపి ఈ స్థాయి వరకు కొనుగోలు చేసుకోవచ్చు. సెకండరీ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసినవి కూడా దీని పరిధిలోకి వస్తాయి.

పన్ను ప్రయోజనాలు..

వీటిపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తించదు. టీడీఎస్‌ కూడా ఉండదు. ఈ బాండ్లను కానుకగా కూడా ఇవ్వొచ్చు. వీటిని బ్యాంకులలో సెక్యూరిటీలుగా ఉంచి రుణాలు పొందవచ్చు. సాధారణ బంగారు రుణంపై తీసుకున్న విలువ ప్రకారమే వీటిపైనా అప్పు తీసుకోవచ్చు. అయితే ఈ విషయంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలదే తుది నిర్ణయం.

వీటికి గ్రాముల ప్రకారం పార్ట్‌ రిడీమ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది. అంటే మొత్తం ఒకేసారి పెట్టుబడి వెనక్కి తీసుకోకుండా కొంచెం కొంచెంగా ఉపసంహరించుకోవచ్చు.

ఎక్కడెక్కడ లభిస్తాయి..

ఈ బాండ్లు బ్యాంకులు(స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకుల వ‌ద్ద తప్ప‌), స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎస్‌హెచ్‌సీఐఎల్‌), పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు(ఎన్ఎస్ఈ, బీఎస్ఈ)ల వ‌ద్ద అందుబాటులో ఉంటాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.