కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు వినిమయం పెంచి డిమాండ్ కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పథకాలు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రయాణ ఓచర్లతో పాటు ప్రతి ఉద్యోగికి పండగ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రకటనలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సీతారామన్ చేసిన ప్రకటనలు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమని.. అవి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచి, ఊతమిస్తాయని పేర్కొన్నారు.
-
Today’s announcements by FM @nsitharaman Ji are timely moves which will boost consumer spending and sentiment as well as push capital expenditure. These steps will also boost demand in our economy. https://t.co/bqhJhz8iwo
— Narendra Modi (@narendramodi) October 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today’s announcements by FM @nsitharaman Ji are timely moves which will boost consumer spending and sentiment as well as push capital expenditure. These steps will also boost demand in our economy. https://t.co/bqhJhz8iwo
— Narendra Modi (@narendramodi) October 12, 2020Today’s announcements by FM @nsitharaman Ji are timely moves which will boost consumer spending and sentiment as well as push capital expenditure. These steps will also boost demand in our economy. https://t.co/bqhJhz8iwo
— Narendra Modi (@narendramodi) October 12, 2020
" ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ జీ ఇవాళ చేసిన ప్రకటనలు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం. ఇవి వినియోగదారుల వ్యయం, మూలధన వ్యయాన్ని పెంచుతాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుంది. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
పండుగ సీజన్లో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) నగదు ఓచర్లను, రూ.10 వేల పండుగ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. డిమాండ్ పెంచడంలో భాగంగా రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా రూ.12,000 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: పండుగలకు ముందు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త