ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. ఖాతాదారులు ఎవరైనా ఇంకా పాన్-ఆధార్ అనుసంధానం (Pan Aadhar link) చేయకపోతే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ (Pan Aadhaar link last date) అని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం రావద్దంటే.. ఈ పనిని పూర్తి చేయడం తప్పనిసరని పేర్కొంది.
పాన్-ఆధార్ అనుసంధానానికి సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రభుత్వమే నిర్ణయించింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది.
ఆధార్‌తో పాన్ లింక్ ఎలా? (How to link Pan with Aadhar)..
- కొత్త ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి (Pan link with Aadhar online).
- అవసర్ సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.. అక్కడ మీకు పాన్-ఆధార్ లింక్ ఫారం కనిపిస్తుంది.
- అందులో.. ఆధార్, పాన్ వివరాలు నింపాలి.
- తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
- ఆధార్ వెరిఫికేషన్‌కు పేజీలో.. I agree to validate my Aadhaar details అనే ఆప్షన్‌ను టిక్ చేయాలి.
- ఆ తర్వాత లింక్ ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
ఎస్ఎంఎస్ ద్వారా..
మీ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎస్ఎస్ పంపడం ద్వారా కూడా పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు. ఇందుకోసం UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి.. 12 అంకెల ఆధార్ నంబర్‌ను, 10 అంకెల పాన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్‌ను 567678 లేదా 56161కు పంపాలి. దీనితో పాన్-ఆధార్ లింక్ పూర్తవుతుంది.
లింక్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా? (Pan Aadhaar link status)
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేసి.. ఆధార్, పాన్ నంబర్లను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఎస్ఎంఎస్ ద్వారా అయితే.. 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి.. 10 అంకెల పాన్ నంబర్‌ను ఎంటర్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్ పంపడం ద్వారా లింక్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
లింక్ చేయకపోతే ఏమవుతుంది?
గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. ఆలస్య రుసుము కింద రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక బిల్లు 2021లో సవరణలు చేసి.. సెక్షన్ 234హెచ్‌ను కొత్తగా చేర్చింది.
గడువులోపు ఈ ప్రక్రియ పూర్తవకుంటే.. పాన్ నిర్వీర్యం అవుతుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అలాంటి పాన్‌ను ఐటీ సేవలకు వినియోగిస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం.. రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: