ETV Bharat / business

ఆర్థిక పునరుజ్జీవం కోసం సార్క్​ దేశాల చర్యలు - సార్క్ దేశాల కూటమి

కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఈ ప్రభావం దక్షిణాసియా దేశాలపై అధికంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సార్క్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలను చేపట్టాయి.

VIRUS-SAARC-ECONOMY
ఆర్థిక పునరుజ్జీవం కోసం సార్క్​ దేశాల చర్యలు
author img

By

Published : Apr 26, 2020, 2:53 PM IST

కరోనా విజృంభణ నేపథ్యంలో దక్షిణాసియా దేశాలు 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఘోర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని ఇటీవల ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఒకవైపు ఆరోగ్య అత్యవసర పరిస్థితి సవాళ్లను ఎదుర్కొంటూనే వారి ప్రజలను కాపాడుకోవాలని సూచించింది. ముఖ్యంగా పేదలపై దృష్టి పెట్టి ఆర్థికంగా కోలుకునేందుకు ప్రయత్నించాలని వివరించింది.

ప్రపంచ బ్యాంకు హెచ్చరిక నేపథ్యంలో కరోనా సంక్షోభంతో కుదేలయిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు సార్క్ దేశాలు చర్యలు చేపట్టాయి. పెట్టుబడులకు ఊతమిచ్చేలా, ప్రైవేటు వ్యాపారాలు కోలుకునేందుకు ఉపశమన ప్యాకేజీలను రూపొందించాయి.

భారత్​లో..

2.9 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో సార్క్ దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న భారత్​.. ఇప్పటికే 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. వృద్ధులు, మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు ఆహారం, వంట గ్యాస్ ఉచితంగా అందిస్తోంది.

రుణాలపై వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.. లక్ష కోట్ల నగదును విపణిలోకి చొప్పించింది. రుణాల చెల్లింపుపై 3 నెలల పాటు మారటోరియం విధించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

అంతేకాకుండా.. దివాలా చట్టాన్ని 6 నుంచి 12 నెలల వరకు రద్దు చేసింది. దీనివల్ల కంపెనీల ఆర్థిక వ్యవహారాలు, రుణాలు చెల్లింపులకు ఊరట కల్పించింది.

పాకిస్థాన్​లో..

దాయాది దేశం పాకిస్థాన్​లో కేసులు విజృంభిస్తోన్న నేపథ్యంలో గత నెలలో లాక్​డౌన్​ విధించారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. దీనిపై తొలుత ప్రైవేట్ రంగ సంస్థలు స్వల్పంగా వ్యతిరేకించాయి. క్రమంగా చిన్న వ్యాపారాలు, దుకాణదారుల్లో అశాంతి నెమ్మదిగా పుట్టుకొచ్చింది. దీర్ఘకాలిక మూసివేతను కొనసాగించలేమని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వ్యాపారాలు, పేదల కోసం 1.2 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది పాక్ ప్రభుత్వం. చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.7,500 కోట్లను కేటాయించింది. వివిధ రంగాల్లోని వ్యాపారవేత్తలు కట్టిన పన్నుల మొత్తం రూ.20 వేల కోట్లు తిరిగి ఇచ్చినట్లు ఇమ్రాన్​ఖాన్​ వెల్లడించారు.

పాకిస్థాన్ కేంద్ర బ్యాంకు నిర్ణయాలు కూడా పలు నిర్ణయాలను ప్రకటించింది. వడ్డీ రేట్లను 13.25 నుంచి 9 శాతానికి తగ్గించింది. వ్యాపారాలకు రాయితీలను 4 నుంచి 5 శాతానికి పెంచింది.

బంగ్లాదేశ్​..

మరో పొరుగు దేశం బంగ్లాదేశ్​ కూడా 11.6 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. తయారీ, సేవల రంగం, వ్యవసాయం, సామాజిక భద్రత లక్ష్యాలుగా ఈ ప్యాకేజీని రూపొందించింది. ఈ ప్యాకేజీ విలువ ఆ దేశ జీడీపీలో 3.5 శాతమని బంగ్లా ప్రధాని షేక్ హసీనా తెలిపారు.

బంగ్లాదేశ్​లో ప్రధాన విదేశీ మారకాన్ని ఆర్జించేది వస్త్ర పరిశ్రమ. దీనిపై 45 లక్షల మంది ఆధారపడ్డారు. 3.2 బిలియన్​ డాలర్ల ఆర్డర్లు రద్దయిన కారణంగా 23 లక్షల మందిపై ఆ ప్రభావం పడినట్లు బంగ్లా గార్మెంట్స్ తయారీ, ఎగుమతిదారుల సంఘం తెలిపింది.

శ్రీలంకలో..

కరోనా కారణంగా ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందకు శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. బ్యాంకులకు రుణ సామర్థ్యాన్ని రూ.40 వేల కోట్లకు పెంచేందుకు 25 కోట్ల డాలర్లను ప్రకటించింది శ్రీలంక కేంద్ర బ్యాంకు. రుణాలపై చెల్లింపుపై మారటోరియం విధించి, మూలధన రుణాలపై 4 శాతం వడ్డీరేటు కల్పించింది.

విదేశీ మారక నిల్వలు పెంచుకునేందుకు భారత రిజర్వు బ్యాంకుతో 40కోట్ల డాలర్ల మార్పిడికి ఒప్పందానికి ప్రణాళికలు రచిస్తోంది.

నేపాల్​..

నేపాల్​లో లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా 1.25 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. కరోనా కారణంగా పర్యటక రంగంపై భారీ ప్రభావం పడింది. హోటల్ పరిశ్రమ ఆదాయం 90 శాతం తగ్గింది. ఈ మేరకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించిన ఆ దేశ ప్రభుత్వం.. విద్యుత్​ బిల్లులో 25 శాతం రాయితీని ఇచ్చింది.

మాల్దీవులు..

మాల్దీవుల్లో అత్యవసర ప్యాకేజీ కింద 16.1 కోట్ల డాలర్లు ప్రకటించింది. వ్యాపారులకు స్వల్పకాలిక మూలధన అవసరాలు తీరేలా అత్యవసర రుణాల కోసం 10 కోట్ల డాలర్లను విడుదల చేసింది.

పర్యటక రంగానికి స్వల్పకాలిక ఆర్థిక సదుపాయాన్ని అందించేందుకు 20 లక్షల డాలర్లు ప్రకటించింది బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్.

భూటాన్​లో విద్యుత్​ రంగం..

కరోనా సంక్షోభంతో భూటాన్​ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయింది. జీడీపీ వృద్ధి రేటు 1 నుంచి 2 శాతం పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక స్థితికి ఊతమిచ్చేందుకు దేశంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులను కొనసాగించాలని నిర్ణయించింది. ఎందుకంటే భూటాన్​ జీడీపీలో 13 శాతం విద్యుత్ రంగానిదే.

అఫ్గానిస్థాన్​లో ఇలా..

ఇప్పటికే దిగుమతులు, ఇతర దేశాల సాయంపై అఫ్గానిస్థాన్​ భారీగా ఆధారపడింది. కరోనా ప్రభావంతో ఆ దేశ పరిస్థితి మరింత దిగజారింది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 2.5 కోట్ల డాలర్లను అఫ్గాన్​ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు కూడా 10.04 కోట్ల డాలర్లను మంజూరు చేసింది.

ఇదీ చూడండి: కరోనాపై పోరుకు నేడు సార్క్‌ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.