తక్షణ నగదు బదిలీ వ్యవస్థ 'రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్' (ఆర్‌టీజీఎస్) సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ శనివారం (ఏప్రిల్ 17) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం 2 గంటల వరకు.. 14 గంటలపాటు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది.
ఆర్‌టీజీఎస్ వ్యవస్థ అప్గ్రేడ్ వల్ల ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు వివరించింది. ముఖ్యంగా డిజాస్టర్ రికవరీ టైమ్‌ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది.
ఆర్‌టీజీఎస్ సేవలకు అంతరాయం ఏర్పడినా.. నెఫ్ట్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది ఆర్బీఐ.
2020 డిసెంబర్ 14 నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు 24x7 అందుబాటులోకి వచ్చాయి.
-
As technical upgrade of RBI's #RTGS is scheduled after the close of business of April 17, 2021, #RTGS service will not be available from 00:00 hrs to 14.00 hrs on Sunday, April 18, 2021. #NEFT system will continue to be operational as usual during this period for #moneytransfers.
— ReserveBankOfIndia (@RBI) April 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">As technical upgrade of RBI's #RTGS is scheduled after the close of business of April 17, 2021, #RTGS service will not be available from 00:00 hrs to 14.00 hrs on Sunday, April 18, 2021. #NEFT system will continue to be operational as usual during this period for #moneytransfers.
— ReserveBankOfIndia (@RBI) April 15, 2021As technical upgrade of RBI's #RTGS is scheduled after the close of business of April 17, 2021, #RTGS service will not be available from 00:00 hrs to 14.00 hrs on Sunday, April 18, 2021. #NEFT system will continue to be operational as usual during this period for #moneytransfers.
— ReserveBankOfIndia (@RBI) April 15, 2021
ఇదీ చదవండి:రూపాయే.. నీకేమాయే: 9 నెలల కనిష్ఠానికి మారకం విలువ