retail inflation rate in november 2021: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) స్వల్పంగా పెరిగింది. గత నెలలో సీపీఐ 4.91 శాతంగా నమోదైనట్టు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) వెల్లడించింది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు కారణం.
ఎన్ఎస్ఓ ప్రకారం.. నవంబర్లో ఆహార ద్రవ్యోల్బణం 1.87శాతంగా ఉంది. అక్టోబర్లో అది 0.85శాతం మాత్రమే. 2021 అక్టోబర్లో సీపీఐ 4.48శాతం. గతేడాది నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.93గా నమోదైంది.
2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం వరకు రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అంచనా వేసింది. ఆ తర్వాత దిగొస్తుందని పేర్కొంది.
ఇదీ చూడండి:- 'పేదల లబ్ధి కోసమే బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు'