ETV Bharat / business

'టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పొడిగింపు'

Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das briefing
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశం
author img

By

Published : May 22, 2020, 10:08 AM IST

Updated : May 22, 2020, 10:42 AM IST

10:34 May 22

కేంద్ర ప్రభుత్వం రూ. 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి (40 బేసిస్‌ పాయింట్లు) తగ్గించినట్లు చెప్పారు. టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.

సిమెంట్‌ ఉత్పత్తిలో 25 శాతం తగ్గిందని తెలిపారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం మేర పడిపోయింది..ఏప్రిల్‌లో తయారీ రంగం ఎన్నడూలేనంత క్షీణత నమోదు చేసిందని  శక్తికాంతదాస్‌ వివరించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడం వల్ల ఆహార భద్రతకు భరోసా ఏర్పడిందన్నారు. 

"వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడం వల్ల వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకం ఉంటుంది. కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గింది" 

             - శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్

10:27 May 22

  • దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఊహించని స్థాయిలో పడిపోయింది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • విద్యుత్‌, పెట్రోలియం ఉత్పత్తులు, వ్యక్తిగత వినియోగం తగ్గింది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • పప్పుధాన్యాలకు సంబంధించి ధరల పెరుగుదల ఆందోళనకరం: ఆర్‌బీఐ గవర్నర్‌
  • పప్పుధాన్యాల దిగుమతుల సుంకాలపై పునఃపరిశీలించాల్సి ఉంది: ఆర్‌బీఐ గవర్నర్‌

10:25 May 22

  • ఈ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమ వర్గాలకు కొంతమేర ఊరట: ఆర్‌బీఐ గవర్నర్‌
  • ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి: ఆర్‌బీఐ గవర్నర్‌
  • రెపోరేటు తగ్గింపును 5-1 ఓట్లతో ఆరుగురు సభ్యుల కమిటీ ఆమోదించింది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • సిడ్బీ రుణాల మారటోరియం మరో 90 రోజులు పొడిగింపు: ఆర్‌బీఐ గవర్నర్‌

10:20 May 22

  • కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు: ఆర్‌బీఐ గవర్నర్‌
  • ఆర్థిక వ్యవస్థకు చాలా తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయి: ఆర్‌బీఐ గవర్నర్‌
  • ద్వితీయార్థం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకునే అవకాశం: ఆర్‌బీఐ గవర్నర్‌
  • కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణ ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల భవిష్యత్తు: ఆర్‌బీఐ గవర్నర్‌
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గింది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకే రెపోరేటు తగ్గించాం: ఆర్‌బీఐ గవర్నర్‌

10:19 May 22

  • కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి: ఆర్‌బీఐ గవర్నర్‌
  • ద్రవ్యోల్బణం అంచనా వేయడం చాలా సంక్లిష్టంగా మారింది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • మున్ముందు ద్రవ్యోల్బణం లాక్‌డౌన్‌ నిబంధనల అమలుపై ఆధారపడి ఉండొచ్చు: ఆర్‌బీఐ గవర్నర్‌

10:16 May 22

  • ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయి: ఆర్‌బీఐ గవర్నర్
  • ఇది వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకం: ఆర్‌బీఐ గవర్నర్

10:13 May 22

  • సిమెంటు ఉత్పత్తి 25 శాతం తగ్గింది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా ప్రభావితమైంది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంది: ఆర్‌బీఐ గవర్నర్‌
  • మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది
  • మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17శాతం మేర పడిపోయింది
  • ఏప్రిల్‌లో తయారీ రంగం ఎన్నడూలేనంత క్షీణత నమోదు చేసింది
  • వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగింది: ఆర్‌బీఐ గవర్నర్‌

10:10 May 22

  • రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించిన ఆర్‌బీఐ
  • రివర్స్ రెపో రేటు 3.35 శాతానికి పరిమితం

10:01 May 22

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశం

  • ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశం
  • రెండు నెలల వ్యవధిలో మూడోసారి ఆర్‌బీఐ గవర్నర్‌ మీడియా సమావేశం
  • రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ

Last Updated : May 22, 2020, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.