ETV Bharat / business

వడ్డీ రేట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన- వరుసగా పదోసారీ..

Reserve Bank of India keeps repo rate
Reserve Bank of India keeps repo rate
author img

By

Published : Feb 10, 2022, 10:24 AM IST

Updated : Feb 10, 2022, 11:04 AM IST

10:20 February 10

వడ్డీ రేట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన- వరుసగా పదోసారీ..

RBI Monetary Policy: కీలక వడ్డీరేట్లను ఆర్​బీఐ వరుసగా పదోసారి యథాతథంగా ఉంచింది. 3 రోజుల సమీక్ష అనంతరం.. ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) నిర్ణయాలను నేడు ప్రకటించారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో.. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్​బీఐ నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందుకు కమిటీ సభ్యులు అంతా అంగీకరించారని వెల్లడించారు.

  • రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్​ రెపో రేటు కూడా 3.35 శాతం వద్ద యథాతథంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు.
  • 2020 మే 22న శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ఎంపీసీ ఆఖరిసారిగా వడ్డీరేట్లలో మార్పులు చేసింది.
  • 2022-23 బడ్జెట్​ తర్వాత.. తొలి ఎంపీసీ సమావేశం ఇదే.

వృద్ధి రేటుపై..

  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటును 7.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది ఆర్​బీఐ.
  • ద్రవ్యోల్బణం 2021-22 ఏడాదికి 5.3 శాతం, 2022-23 ఏడాదికి 4.5 శాతంగా ఉంటుందని అంచనా.

రెపో, రివర్స్​ రెపో రేట్లు అంటే?

బ్యాంకులు తమ అవసరాలకు.. రిజర్వు బ్యాంక్​ నుంచి తీసుకునే రుణంపై చెల్లించే వడ్డీనే రెపో రేటు అంటారు. బ్యాంకుల వద్ద ద్రవ్యలభ్యత తక్కువున్న సమయంలో ఇలా రుణం తీసుకుంటాయి.

బ్యాంకులు తమ వద్ద అదనంగా ఉన్న నగదును ఆర్​బీఐ వద్ద జమ చేస్తుంటాయి. ఇందుకు ఆర్​బీఐ ఆయా బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యత పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువైనా కూడా ఆర్​బీఐ.. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుంది.

Stock Market Live: ఆర్​బీఐ ప్రకటనకు ముందు దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి. కీలక రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించిన అనంతరం.. మళ్లీ లాభాల్లోకి మళ్లాయి.

ఇదీ చూడండి: సామాన్యులపై రెపో, రివర్స్​ రెపో రేట్ల ప్రభావం ఎంత?

Last Updated : Feb 10, 2022, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.