ETV Bharat / business

ఆ రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం: ఆర్​బీఐ - కొవిడ్ రెండో దశపై ఆర్​బీఐ స్పందన

కొవిడ్-19 రెండో దశ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేసేందుకు వర్తకులు అలవాటు పడ్డారని పేర్కొన్నారు. సంక్షోభం నుంచి బయటపడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా హెల్త్​కేర్​, చిన్న రుణ సంస్థలకు భారీగా నిధులు ప్రకటించారు.

RBI on Covid Second wave
కరోనా రెండో దశపై ఆర్​బీఐ స్పందన
author img

By

Published : May 5, 2021, 10:47 AM IST

Updated : May 5, 2021, 2:54 PM IST

దేశంలో కొవిడ్ సంక్షోభం తీవ్రమవుతన్న నేపథ్యంలో ఆర్​బీఐ రంగంలోకి దిగింది. ఎంపిక చేసిన వ్యక్తిగత, చిన్న తరహా పరిశ్రమ రుణాలపై మారటోరియం విధించింది. రెండేళ్ల వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కరోనా సంక్షోభంలో నేపథ్యంలో వైద్య మౌలిక సదుపాయాలు, వ్యాక్సిన్​ తయారీ దారులకు రుణాల విషయంలో ప్రధాన్యం ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది.

కొవిడ్‌ సంబంధిత వైద్యవిభాగాలకు ప్రత్యేక నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తి కాంతదాస్‌ వెల్లడించారు. ఇందుకోసం రూ.50 వేలకోట్ల మేరకు ఆన్‌ట్యాప్‌ నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. వీటికి మూడేళ్ల కాల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు.

"భారత్‌ కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందన్న నమ్మకం ఉంది. ఈ సారి రుతుపవనాలు కూడా సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో గ్రామాల్లో డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నాం. కొవిడ్‌ నిబంధనలు, ఆంక్షల్లో.. పలు సంస్థలు వ్యాపారాలను కాపాడుకునే శక్తిని తెచ్చుకున్నాయి. కొవిడ్‌ వైద్య సదుపాయాల పెంపునకు ఆర్‌బీఐ రూ.50వేల కోట్ల నిధులను బ్యాంకులకు అందుబాటులోకి తెచ్చింది"

-శక్తికాంత దాస్​, ఆర్​బీఐ గవర్నర్​

ఈ నిధులను బ్యాంకులు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు, ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకు రుణాలుగా ఇవ్వొచ్చు. ఈ రుణాలకు ప్రాధాన్యం కూడా ఇవ్వనున్నారు. బ్యాంకులు ఈ పథకం కింద కొవిడ్‌ లోన్​బుక్‌ ఏర్పాటు చేయవచ్చు.

చిన్న రుణ సంస్థలకు రూ.10 వేల కోట్లు..

ఇక చిన్న తరహా రుణ సంస్థల కోసం రూ.10వేల కోట్ల దీర్ఘకాల రుణాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. గతంలో రుణాల రీస్ట్రక్చర్‌ను వాడుకున్నవారు మరో రెండేళ్లపాటు మారటోరియం పొందే అవకాశం ఇచ్చారు.

భారత్‌ వద్ద 588 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఉండటం వల్ల సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుందన్నారు గవర్నర్​. రూ.25 కోట్ల వరకు రుణాలు తీసుకున్న వ్యక్తులు రీస్ట్రక్చర్‌ చేసుకోవడానికి రెండో అవకాశం ఇచ్చింది ఆర్బీఐ. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ ఇచ్చే ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్య నిబంధనలు సరళతరం చేసింది. దీంతో గతంలో 36 రోజుల వరకు ఉండే గడువు.. ఇప్పుడు 50 రోజులకు పెంచింది.

సాధారణ వర్షపాతం సానుకూలమే..

2021-22లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతారవరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో గ్రామీణ డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్లు దాస్ పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 5, 2021, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.