తరతరాలుగా జనాలను ఏడిపిస్తోన్న ఉల్లి.. దాని పరంపరను కొనసాగిస్తోంది. అయితే.. కాస్త ట్రెండ్ మార్చి కోసేటప్పుడే కాదు కొనేటప్పుడే ఏడిపించడం ప్రారంభించింది. ఖరీదు చూస్తేనే ఖంగుతినేలా చేస్తోంది. తమిళనాడు మధురైలో కిలో రూ. 200లకు చేరుకుని ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది.
'5 కిలోలు కొనడానికి వచ్చే వినియోగదారులు.. కేవలం ఒక్క కేజీ కొనుక్కుని వెనుదిరుగుతున్నారు.' అంటున్నారు ఉల్లి వ్యాపారులు. ఇక వారానికి కేవలం ఉల్లి కొనుగోలు కోసం రూ.350 నుంచి 400 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు వినియోగదారులు.
పంట దిగుబడి తగ్గిపోయి సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది ఉల్లి. గత కొద్ది రోజులుగా దేశంలో ఎటు చూసినా ఉల్లి లొల్లి వినిపిస్తూనే ఉంది.
ఇదీ చదవండి:దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ అటవీ అధికారిగా దీప్తి!