ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) 95వ వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ అభివృద్ధిలో ఈ సంస్ధ చేస్తున్న కృషిని ప్రశంసించారు. 95 ఏళ్లు జాతికి సేవచేయడం ఏ సంస్థకైనా గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు మోదీ.
అవి భారత్ బలాన్ని పెంచాయి..
కరోనా, తుపాన్లు, మిడతలు సహా భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను ఐకమత్యం, సంకల్ప బలంతోనే ఎదుర్కోగలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడమే ముఖ్యమని అన్నారు. గతంలో భారతదేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని గుర్తు చేసిన మోదీ అలాంటివి భారత్ బలాన్ని మరింత పెంచాయని అన్నారు.
ప్రపంచం భారత్‌వైపు చూస్తోంది..
సవాళ్లకు భయపడి చేతులెత్తేస్తే ఎలాంటి అవకాశాలు కనిపించవని తెలిపారు. ఆత్మ స్థైర్యం ద్వారా ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చని ప్రధాని ఉద్బోధ చేశారు. దేశ ప్రజలంతా తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించే సమయం ఇదే అని మోదీ తెలిపారు. కరోనా మహమ్మారిపై గట్టి పోరాటం చేస్తున్నామని తెలిపిన మోదీ.. ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని అన్నారు.
ఇదీ చూడండి:10 శాతం ఐటీ ఉద్యోగాలకు కరోనా గండం!