ETV Bharat / business

AARUNYA MART: గ్రామీణ మహిళలు సాధించిన... అద్భుత విజయమిది!

నారాయణపేట్‌ చీరల నేత అందం గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు! చీరలు మాత్రమే కాదు ఆ జిల్లా పేరుచెబితే గుర్తొచ్చే ఎన్నో ప్రత్యేకతలని ఒక వేదికమీదకి తీసుకొచ్చారు ఆ జిల్లా మహిళలు. కళాఖండాలు, నగలు, నోరూరించే స్నాక్స్‌... వంటివాటికి ‘ఆరుణ్య’ బ్రాండ్‌ సరికొత్త చిరునామాగా మారింది.. గ్రామీణ మహిళలు సాధించిన ఈ విజయం ఎందరినో అబ్బురపరుస్తోంది..

AARUNYA MART
‘ఆరుణ్య’ బ్రాండ్‌
author img

By

Published : Aug 17, 2021, 11:45 AM IST

వాళ్లే బిజినెస్‌ స్కూళ్లలోనూ చదువుకోలేదు.. ఎంబీయేలు, ఎంసీయేలూ చేయలేదు. వారంతా మారుమూల గ్రామీణ ప్రాంతాల మధ్యతరగతి మహిళలు. ఆసక్తి, పట్టుదలనే పెట్టుబడిగా పెట్టారు. తమకంటూ గుర్తింపు ఉండాలని తపించారు. ఆ తపనలోంచి పుట్టుకొచ్చిందే ‘ఆరుణ్య బ్రాండ్‌’. దీని పుణ్యమాని జిల్లాలోని నేత కార్మికులు, కళాకారుల ఉత్పత్తులు ప్రపంచ వేదికపై సందడి చేస్తున్నాయి. తెలంగాణలోని నారాయణపేట్‌ జిల్లాకు చెందిన పదిమంది మహిళలు కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థ లాభాల బాట పట్టిన తీరు స్ఫూర్తిదాయకం.

చేనేత చీరలు

నారాయణపేట జిల్లాలోని ప్రత్యేకతలన్నింటికీ ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని అనుకున్నారు జిల్లా కలెక్టర్‌ హరిచందన. ఇదే విషయాన్ని జిల్లాస్థాయి సమావేశంలో ప్రస్తావించారామె. ఆ సమావేశానికి వచ్చిన వారిలో పదిమంది మహిళలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని మేం నడిపిస్తామన్నారు. తలా పదివేల చొప్పున లక్ష రూపాయలు జమచేసి కంపెనీకి నాంది పలికారు. మొదట చేనేత వస్త్రాలు, వెదురుతో కళాకృతులు, టీ, జామ్‌లు చేసి అమ్మేవారు. వాటికి ఆదరణ రావడంతో మరికొందరు మహిళలు ముందుకొచ్చారు. అలా పదిమందితో మొదలైన ఈ బృందం ఇప్పుడు ఇతర మహిళా సంఘాలని కూడా కలుపుకొని విజయవంతంగా అడుగులు వేస్తోంది. జిల్లాలోని నేతకార్మికుల ఉత్పత్తులని ఆరుణ్య పేరుతో మొదట సూపర్‌ మార్కెట్లలో విక్రయించారు. డిమాండ్‌ పెరగడంతో జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఒక స్టోర్‌నే ఏర్పాటు చేశారు. అదీ విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో తమ ఉత్పత్తులని అందరికీ పరిచయం చేయడం కోసం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సాయంతో ‌www.aarunyanarayanpet.in సైట్‌ని ప్రారంభించి దాని ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో ఆరుణ్య ఉత్పత్తుల గొప్పదనం ఎల్లలు దాటింది. లాక్‌డౌన్‌ సమయంలో పర్యావరణహితంగా ఉండే ఈ ఉత్పత్తులకు ఆదరణ రెట్టింపయ్యింది. అసలు సిసలు చేనేత వస్త్రాలతో పాటు జనప నార సంచులు, వెదురు అలంకరణ వస్తువులు, సహజ సిద్ధ టీలు, జామ్‌లు, పొడులూ ఈ సైట్‌లో లభ్యమవుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించే టీ పొడికి కరోనా సమయంలో విశేష ఆదరణ లభించింది.

..

16లక్షల యూనిఫామ్‌లు...

కొవిడ్‌ సమయంలో వీరు తయారుచేసిన ఆయుర్వేద మాస్కులకు మంచి గిరాకీ వచ్చింది. ఒక్క డెలాయిట్‌ సంస్థకే (హైదరాబాద్‌) 1.24 లక్షల మాస్కులను విక్రయించారు. హైదరాబాద్‌ మెట్రోరైల్‌, ఫిక్కి వంటి సంస్థలకూ భారీ సంఖ్యలో మాస్కులను అందించారు. జిల్లాలోని గురుకుల పాఠశాలలు, హాస్టల్‌ విద్యార్థులకు 16 లక్షల యూనిఫామ్స్‌ కుట్టి అందించే పనిని అధికారులు ఈ సంస్థకే అప్పజెప్పారు. అన్నట్టు దిల్లీలో జరుగుతున్న జాతీయ ఎగ్జిబిషన్‌లో వీరి ఉత్పత్తులని నటి, ఎంపీ సుమలతతో పాటు ఇతర మహిళా ఎంపీలూ ఎంతో ఇష్టంగా కొనుక్కుంటున్నారట.

- నర్సింగోజు మనోజ్‌ కుమార్‌, మహబూబ్‌నగర్‌

రూరల్‌మార్ట్‌...

ఆరుణ్యలో తొలుత మొదలుపెట్టిన పదిమంది మహిళలే కీలక సభ్యులయినా... తర్వాతర్వాత జిల్లాలోని వివిధ మహిళా సంఘాల సభ్యులు కూడా తోడయ్యారు. ఇప్పుడు వారంతా ఈ సంస్థ నుంచి ఉపాధి పొందుతున్నారు. వీరందరూ వారి ఉత్పత్తులని నారాయణపేట్‌లోని ఆరుణ్య రూరల్‌ మార్ట్‌లో విక్రయిస్తారు. ఈ రూరల్‌ మార్ట్‌ నిర్వహణ కోసం నాబార్డు రూ. 5 లక్షల రుణం మంజూరు చేసింది. ఈ మహిళా చైతన్యాన్ని గమనించిన డీఆర్‌డీఏ.. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులో నేత వస్త్రాల తయారీ, అలంకరణ వస్తువులు, టీపొడులు, జామ్‌ తయారీల్లో శిక్షణ ఇస్తున్నారు. తర్వాత వాళ్ల ఉత్పత్తులను ఆరుణ్య బ్రాండ్‌తో అమ్ముకోవచ్చు. ఇలా కొద్ది కాలంలోనే ఈ మహిళలంతా కలిసి రూ.30 లక్షల పైచిలుకు వ్యాపారాన్ని చేశారు.

ఇదీ చూడండి: Rice Export: విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో 36% తెలుగు రాష్ట్రాల నుంచే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.