ETV Bharat / business

కరోనా దెబ్బకు 'ఎంఎస్​ఎంఈ'ల ఉనికే ప్రశ్నార్థకం..? - micro, small and medium enterprises in india news

ఆర్థికాభివృద్ధి పూర్తిగా కుంటుపడిన నేపథ్యంలో.. వ్యవసాయం తర్వాత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మాత్రమే. కరోనా దెబ్బకు ఈ రంగం కుదేలైంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో కొంత ఊరట కలిగించినా.. ఆయా పరిశ్రమలు ఇంకా నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. వాటికి కారణాలివే..

msme sector
కరోనా దెబ్బకు 'ఎంఎస్​ఎంఈ'ల ఉనికే ప్రశ్నార్థకం..?
author img

By

Published : Aug 30, 2020, 12:30 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థలో, సరఫరా చైన్‌లో ఎంఎస్​ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా, దాని నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ వల్ల వాటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. కేంద్రం చర్యలు తీసుకోవడం వల్ల కాస్త నిలదొక్కుకున్నా.. ఇంకా పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదని, రుణాన్ని కూడా చెల్లించలేని పరిస్థితిల్లో ఉన్నట్లు వాటి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సంక్షోభం వల్ల ఇప్పటికే కొన్ని ఎంఎస్​ఎంఈలు మూతపడగా.. మరికొన్ని తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.

సామర్థ్యంలో తగ్గుదల...

ఇటీవల 6వేల ఎంఎస్​ఎంఈలపై ఆన్‌లైన్‌లో నేషనల్‌ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్​ ఓ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం ఆయా పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. 26 శాతం ఎంఎస్​ఎంఈలు మాత్రమే 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టమైంది. 9 శాతం ఎంఎస్​ఎంఈలు పూర్తిగా మూతబడ్డాయి. ఈ సర్వే ప్రకారం.. ఆయా పరిశ్రమలకు లిక్విడిటీ ప్రధాన సమస్యగా ఉంది. కొత్తగా ఆర్డర్లు లేకపోవటం, రవాణాలో సమస్యలు, ముడిసరుకు, కార్మికుల లభ్యతలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు.

కరోనాతో పాటు లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో.. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో కొన్ని చర్యలు తీసుకుంది. ఎంఎస్​ఎంఈల పరిధిని విస్తరించటమే కాకుండా మారటోరియం, 3 లక్షల కోట్ల రుణాలు తదితరాలు ఇందులో ఉన్నాయి. ఈ చర్యల వల్ల కొన్ని పరిశ్రమలు మూసివేసే పరిస్థితిని తప్పించుకొని… ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి.

క్రెడిట్‌ లైన్‌లో సమస్యలు…

కేంద్ర ప్రభుత్వం రుణాలిచ్చేందుకు ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎంఎస్​ఎంఈలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. గతంలో రుణాన్ని సరైన సమయంలో చెల్లించకపోవటం వంటి సమస్యల కారణంగా తిరిగి రుణాన్ని రాబట్టుకోవటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొందరు బ్యాంకర్లు. ఫలితంగా రుణాన్ని ఇచ్చేందుకు మొగ్గుచూపటం లేదు. రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ బ్యాంకులు తప్ప ప్రైవేట్‌ బ్యాంకులు మొగ్గు చూపటం లేదని ఎంఎస్​ఎంఈల యజమానులు చెబుతున్నారు. ఒకవేళ ప్రైవేటు బ్యాంకులు రుణాలిచ్చినప్పటికీ.. ఎక్కువ వడ్డీని తీసుకుంటున్నాయని వారు వెల్లడించారు.

"ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలిచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయి. కానీ కొన్ని ప్రైవేటు బ్యాంకులు రుణాలివ్వడం లేదు. ఒకవేళ రుణాలిచ్చినా ఎక్కువ వడ్డీరేట్లను వసూలు చేస్తున్నాయి. సాధారణంగా మాకు ఇచ్చే క్రెడిట్‌ లైన్‌పై వడ్డీ రేటు 10 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వడ్డీ రేట్లు 5 నుంచి 6 శాతం మధ్య ఉన్నాయి. కాబట్టి క్రెడిట్‌ లైన్‌పై వడ్డీ రేట్లు తగ్గించాలి".

- అనీల్‌ రెడ్డి , మాజీ అధ్యక్షులు, ఫెడ్‌రేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ.

మారటోరియం తర్వాత పరిస్థితి ఆందోళనకరమే..

ప్రస్తుతం కొన్ని రంగాల్లో డిమాండ్‌ చాలా తక్కువగా ఉంది. ఫార్మా, నిత్యావసరాలు తదితరాలకు డిమాండ్‌ మంచి స్థాయిలో ఉంది. వీటికి సంబంధించిన పరిశ్రమలు మాత్రమే మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. చాలా ఎంఎస్​ఎంఈలు... పెద్ద పరిశ్రమల సరఫరా చైన్‌లో భాగంగా ఉంటాయి. ప్రస్తుతం డిమాండ్‌ తక్కువగా ఉండటం వల్ల పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్లు తగ్గిపోయాయి. ఫలితంగా పూర్తి సామర్థ్యం ఉపయోగించుకోలేకపోతున్నాయి ఎంఎస్​ఎంఈలు.

ఆగస్టుతో మారటోరియం గడువు పూర్తవుతోంది. దీనితో వచ్చే సెప్టెంబర్​ నుంచి రుణ వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించకపోవటం, కొన్ని యూనిట్లు మూసివేసి ఉండటం వల్ల రుణాన్ని చెల్లించలేని పరిస్థితి ఉందని ఎంఎస్​ఎంఈల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీనివల్ల మొండిబకాయిలు, నిరర్ధక ఆస్తులు పెరిగే అవకాశం ఉంది.

కార్మికుల సమస్య…

ఎంఎస్​ఎంఈలు... కార్మికుల సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయి. ఎక్కువ మంది వలస కార్మికులు ప్రస్తుతం స్వస్థలాల్లో ఉన్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్న నేపథ్యంలో వారు పనిప్రదేశాలకు వచ్చేందుకు మొగ్గు చూపటం లేదు. తిరిగొచ్చిన వారు కూడా ఎక్కువ మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. దీనితో కార్మికులపై వెచ్చించాల్సిన ఖర్చు పెరిగిపోతోంది. స్థానికంగా కార్మికులు లభ్యమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వం ఏం చెబుతోంది..?

ఎంఎస్​ఎంఈలకు సంబంధించి మరోసారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఊహగానాలున్నాయి. దీనిని వాటి ప్రతినిధులు స్వాగతిస్తున్నారు. తక్కువ వడ్డీకి లేదా వడ్డీ లేని రుణాలు అందించాలని వారు కోరుతున్నారు.

''ప్రస్తుతం అన్ని ఎంఎస్​ఎంఈలు కార్యకలాపాలు నిర్వహించడం లేదు. పనిచేస్తున్నవి కూడా తక్కువ సామర్థ్యంతో నడుస్తున్నాయి. మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవటం వల్ల ఇలా జరుగుతోంది. పెద్ద సంస్థల ఆర్డర్లూ తగ్గిపోయాయి. ఎంఎస్​ఎంఈలకు వడ్డీ లేని రుణాలిచ్చి ఆదుకోవాలి.''

- సుధీర్‌ రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షుడు

ఎంఎస్​ఎంఈలను ఆదుకోవడమే కాకుండా ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకూ నిర్మాణాత్మక చర్యలతో ముందుకు రావాల్సి ఉంది. అమ్మేవాళ్లు ఉండి... కొనేవాళ్లు లేకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే క్రమంలో భాగంగా సమతుల్య వ్యూహంతో ముందుకు కదలాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.